Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్ 60 రోజుల్లోపు అప్పీలు చేసుకోవచ్చు: పాకిస్థాన్ రక్షణ మంత్రి

పాకిస్థాన్ మరణ శిక్ష విధించిన భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్ 60 రోజుల్లోపు అప్పీలు చేసుకోవచ్చునని పాకిస్థాన్ వెల్లడించింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గూఢచర్యం చేశాడనే ఫిర్యాదుతో జాదవ్‌కు పాకిస్థాన్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (09:10 IST)
పాకిస్థాన్ మరణ శిక్ష విధించిన భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్ 60 రోజుల్లోపు అప్పీలు చేసుకోవచ్చునని పాకిస్థాన్ వెల్లడించింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గూఢచర్యం చేశాడనే ఫిర్యాదుతో జాదవ్‌కు పాకిస్థాన్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. భారత నావికాదళంలో అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన కుల్ భూషణ్ జాదవ్.. పాక్‌కు వ్యతిరేకంగా గూఢచర్యానికి పాల్పడ్డాడని ఉరిశిక్షకు గురైయ్యాడు. 
 
అయితే సరైన ఆధారాలు లేకుండా జాదవ్‌కు ఉరిశిక్ష విధించడంపై భారత్ ఫైర్ అయ్యింది. పాకిస్థాన్‌ను హెచ్చరించింది. పాకిస్థాన్ కూడా ప్రతి సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో జాదవ్ తన శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్ చేసుకోవచ్చునని పాకిస్థాన్ ఓ మెట్టు దిగింది. ఈ మేరకు పాకిస్థాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. జాదవ్ వ్యవహారంలో భారత్ పేర్కొన్నట్లు పాకిస్థాన్ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. 
 
జాదవ్‌కు మరణ శిక్ష విధించడం ప్లాన్ ప్రకారం చేసిన హత్య కాదని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో వ్యూహానికి తగ్గట్లు హత్యలు జరుగుతున్నాయన్నారు. జాదవ్ కేసును మూడు నెలల పాటు విచారించిన తర్వాతే తీర్పు ఇవ్వడం జరిగిందని.. ఈ కేసును హడావుడిగా ముగించలేదన్నారు. అంతేగాకుండా సైనిక కోర్టు ఇచ్చిన తీర్పుపై జాదవ్ 60 రోజుల్లో అప్పీలు కూడా చేసుకోవచ్చునని తెలిపారు.  
 
ఇదిలా ఉంటే.. పాక్ మిలిటరీ కోర్టు సోమవారం ఆయనకు మరణ శిక్ష విధించినట్లు తెలియడంతో ముంబైలోని జాదవ్ అపార్ట్‌మెంట్‌కు పోలీసులు, మీడియా సిబ్బంది భారీగా తరలివచ్చారు. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులు ఆ ఇంటిని ఖాళీ చేసి పూణెకు వెళ్ళిపోయారని, చాలాకాలంగా అది లాక్ వేసి ఉందని స్థానికులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారీ భద్రత మధ్య సల్మాన్ ఖాన్ చిత్ర షూటింగ్

అంతఃపురంలో మహిళలకు సేవ చేసేవారు తెలుగు ప్రజలు : తమిళ నటి కస్తూరి

అన్నపూర్ణ స్టూడియోలో చైతూ-శోభిత వివాహం?

పుష్ప-2తో చైతూపై రివంజ్ తీసుకోనున్న సమంత?

అజాద్ హింద్ ఫౌజ్ పేరుతో ప్రభాస్ చిత్రం- - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments