Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కొరియాకు సోదరి, ప్రేయసి.. ఉత్తర కొరియా చీఫ్ కిమ్ పక్కా ప్లాన్?

దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్‌కు దక్షిణ కొరియా సాదర స్వాగతం పలికింది. ఇంకా పసం

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (14:21 IST)
దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్‌కు దక్షిణ కొరియా సాదర స్వాగతం పలికింది. ఇంకా పసందైన విందు ఏర్పాటు చేసింది. వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో దక్షిణ కొరియాకు వచ్చిన కిమ్ సోదరితో పాటు ఆ దేశ ప్రతినిధుల బృందానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్.. సియోల్‌లో తన అధికార నివాసంలో పసందైన విందు ఏర్పాటు చేశారు. 
 
శత్రు రాజ్యమైనా ఆతిథ్యమివ్వడంతో తమ దేశం ముందుంటుందని.. ఈ విందు ద్వారా దక్షిణాఫ్రికా నిరూపించుకుంది. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించడంతో ప్రపంచ దేశాలన్నీ కిమ్‌పై గుర్రుగా వున్న తరుణంలో వీఐపీ బాక్సులో కూర్చుని కిమ్ సోదరి వింటర్ ఒలింపిక్స్ వీక్షించగా, కాస్త దగ్గర్లోనే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూర్చుని క్రీడలను ఆసక్తిగా తిలకించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్.. ఇందులో రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారని అంటున్నారు. దక్షిణ కొరియాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌ కోసం క్రీడాకారులతో పాటు ఉత్తరకొరియా ప్రతినిధిగా కిమ్ సోదరి కిమ్ యో జంగ్‌ను, వింటర్ ఒలింపిక్స్ టీమ్ మేనేజర్‌గా తన మాజీ ప్రేయసి హోన్ సాంగ్ వోల్‌ను పంపారు.

ఇలా చేయడం ద్వారా దక్షిణకొరియాతో ఉ.కొరియా సన్నిహిత సంబంధాలు కోరుకుంటుందనే సందేశాన్ని కూడా పంపారు. కనీ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కాక ముందే ఉత్తరకొరియాలో కిమ్ జాంగ్ తన సైనిక సామర్థ్యాన్ని చూపించారు. బలప్రదర్శన తరహాలో సైనిక కవాతును కిమ్ సతీసమేతంగా వీక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments