Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవోకేలో చైనా బసు సర్వీసు... కరాచీలో డ్రాగన్ ఎంబసీపై ఉగ్రవాదుల దాడి

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (12:17 IST)
భారత ప్రభుత్వం అనుమతిలేకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసులు చైనా నుంచి పాకిస్థాన్‌ల మధ్య నడుస్తాయి. ఈ సర్వీసులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై పాకిస్థాన్‌లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. శుక్రవారం ఉదయం ఈ కాల్పులకు తెగబడగా ముగ్గురు ఉగ్రవాదులను పాక్ భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అలాగే, ఇద్దరు పోలీసులతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చైనాకు చెందిన ఓ భద్రతాధికారి గాయపడ్డారు. 
 
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోని చైనా రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇటు పాకిస్థాన్‌లోనూ అటు చైనాలోనూ కలకలం సృష్టించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని, పశ్చిమ పాకిస్థాన్‌లో చైనా పెట్టుబడి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నామని అందుకే ఈ దాడులకు పాల్పడినట్లుగా మిలిటెంట్లు అధికారికంగా ప్రకటించారు. 
 
ఇటీవల పాకిస్థాన్ టు చైనాల మధ్య ఓ బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఈ బస్సు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇండో-పాక్ దేశాల మధ్య ఉన్న నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం. కానీ, పాక్‌ - చైనా దేశాల మధ్య ఉన్న సత్‌సంబంధాల కారణంగా భారత్‌ను విస్మరించి బస్సు సర్వీసు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments