Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ ఇంగ్లండ్ విజేతగా భారత సంతతి అమ్మాయి

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (11:01 IST)
మిస్ ఇంగ్లండ్ పోటీల్లో భారత సంతతికి చెందిన బాషా ముఖర్జీ విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో ఫైనల్‌కు మొత్తం 12 మంది అమ్మాయిలు ఎంపికకాగా, వారందరినీ తోసిరాజని బాషా ముఖర్జీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మిస్ ఇంగ్లండ్ పోటీలు తాజాగా జరిగాయి. ఈ అందాల పోటీల్లో 12 మంది ఫైనలిస్టులను అధిగమించి అందాల రాణి కిరీటాన్ని ముఖర్జీ దక్కించుకుంది. తద్వారా మిస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించింది. 
 
23 ఏళ్ల బాషా ముఖర్జీ ప్రస్తుతం ఓ జూనియర్ వైద్యురాలిగా బోస్టన్‌లో పనిచేస్తోంది. ఈమె ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈమె ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఒక మెడికల్ డిగ్రీ సంపాదించడమే చాలా కష్టమైన నేపథ్యంలో, అమ్మడు రెండు మెడికల్ డిగ్రీలు సాధించింది. 
 
అన్నింటికంటే ముఖ్యంగా, ఈ భారత సంతతి యువతి ఐక్యూ స్థాయి 146 కావడం విశేషం. బాషాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం బ్రిటన్ వలస వెళ్లింది. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. మెడిసిన్ చదువుతున్నప్పుడే అందాల పోటీల్లోనూ పాల్గొనాలని నిశ్చయించుకుని అందుకు సిద్ధమవుతూ వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments