Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాషింగ్ట‌న్ కోర్టుకు భార‌త సంత‌తి జ‌డ్జి

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:15 IST)
అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్‌లో ఉన్న అత్యున్న‌త న్యాయ‌స్థానానికి భార‌త సంత‌తికి చెందిన విజ‌య్ శంక‌ర్‌ జ‌డ్జిగా నియ‌మితులు కానున్నారు.

ఈమేరకు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒక‌వేళ ట్రంప్ ప్ర‌తిపాద‌న‌కు సేనేట్ ఆమోదం తెలిపితే, అప్పుడు కొలంబియా అప్పిల్ కోర్టుకు అసోసియేట్ జ‌డ్జిగా విజ‌య్ శంక‌ర్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తారు.

వాషింగ్ట‌న్ డీసీలో కొలంబియా జిల్లా కోర్టు అత్యున్న‌త‌మైన‌ది. న్యాయ‌శాఖ‌ నేరవిభాగంలో ప్ర‌స్తుతం సీనియ‌ర్ లిటిగేష‌న్ అధికారిగా శంక‌ర్ ప‌నిచేస్తున్నారు. 
 
న్యాయ‌శాఖ‌లో చేర‌డానికి ముందు జ‌స్టిస్ శంక‌‌ర్ ప్రైవేటు ప్రాక్టీస్ చేశారు. వాషింగ్ట‌న్ కోర్టులోని జ‌డ్జి చెస్ట‌ర్ జే స్ట్రాబ్ వ‌ద్ద శంక‌ర్‌ క్ల‌ర్క్ గా చేశారు.

డ్యూక్ వ‌ర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. వ‌ర్జీనియా న్యాయ విద్యాల‌యం నుంచి జేడీ ప‌ట్టా పొందారు. వ‌ర్జీనియా లా రివ్యూకు నోట్స్ ఎడిట‌ర్‌గా చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments