అమెరికా 46వ అధ్యక్షుడుగా జోబైడెన్ ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, బైడెన్ బృందంలో అధిక సంఖ్యలో భారతీయులు కొలువుదీరడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. భారత సంతతి వ్యక్తులు శ్వేతసౌధంలో, కీలక ప్రభుత్వ పదవుల్లో నియమితులయ్యారు. ఒకరా, ఇద్దరా .. ఏకంగా 20 మంది ఇండో-అమెరికన్ పౌరులు కీలక బాధ్యతల్లో నియమితులయ్యారు. ఇది అమెరికా చరిత్రలోనే తొలిసారి.
ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ భారతీయ మూలాలున్నవారే. ఆమెనే కాక - తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయ సంతతికి చెందిన ప్రముఖులను తన బృందంలోకి తీసుకుంటానని బైడెన్ గతంలోనే వెల్లడించారు. అగ్రశ్రేణి పదవులకు ఎంపికైన ప్రముఖుల్లో నీరా టాండన్ ఒకరు. ఈమె ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1988 నుంచి 2016 దాకా ప్రతీ డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి ప్రచారంలోనూ ఆమెది కీలకపాత్ర. డెమొక్రాట్ ప్రభుత్వాల్లో విధానపరమైన సలహాదారుగా కేపిటల్ హిల్‌లో పనిచేసిన విశేషానుభవం ఉన్న వ్యక్తి.
ఇక బైడెన్ ఎంపిక చేసుకున్న వ్యక్తి డాక్టర్ వివేక్ మూర్తి. అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులవుతున్నారు. ఆరోగ్యరంగ నిపుణుడిగా ఆయన వ్యాక్సినేషన్ విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొవిడ్ టెస్టింగ్ విభాగం వ్యవహారాలను చూసే బాధ్యతను డాక్టర్ విదుర్ శర్మకు అప్పగించారు.
ఇకపోతే, బైడెన్ వెలువరించే ప్రసంగాలన్నింటినీ పకడ్బందీగా రాసే బాధ్యత వినయ్‌రెడ్డిది. స్పీచ్ డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. అధ్యక్ష సిబ్బంది కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం బైడెన్ టీమ్‌లో చోటు దక్కించుకున్న భారతీయుల వివరాలను పరిశీలిస్తే,
వేదాంత్ పటేల్... అధ్యక్షుడికి సహాయ ప్రెస్ సెక్రటరీ