Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకంతో ఆడుతూ కాలు విరగ్గొట్టుకున్న జో బైడెన్!! (Video)

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (13:23 IST)
అమెరికా దేశానికి కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్. ఈయన అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడుగా జనవరి 20వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన చిన్నపాటి ప్రమాదానికి గురయ్యారు. తన పెంపుడు శునకంగా అట్లాడుతూ కాలు విరగ్గొట్టుకున్నారు. పాదం భాగంలో స్వల్పంగా చీలిక ఏర్పడినట్టు సీటీ స్కాన్ రిపోర్టులో తేలింది. దీంతో ఆయన కుడి పాదం ఫ్రాక్చర్ అయిందని వైద్యులు తేల్చారు. 
 
ఇంట్లో త‌న పెంపుడు కుక్క‌తో ఆడుతున్న స‌మ‌యంలో బైడెన్ జారిపడ్డారు. దీంతో ఈ గాయం ఏర్పడింది. దిలావేర్ ఆర్థోపెడిక్ హాస్పిట‌ల్‌కు వెళ్లిన‌ బైడెన్‌కు డాక్ట‌ర్లు తొలుత ఎక్స్ రే తీశారు. అయితే దాంట్లో ఏమీ తేల‌క‌పోవ‌డంతో సీటీ స్కాన్ చేశారు. పెంపుడు శున‌కం మేజ‌ర్‌తో ఆడుతున్న‌ప్పుడు.. బైడెన్ కాలు విరిగిన‌ట్లు తెలుస్తోంది. 
 
ఫ్రాక్చ‌ర్ కావ‌డం వ‌ల్ల న‌డిచేందుకు బైడెన్.. బూట్స్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వారాల పాటు వాకింగ్ బూట్ అవ‌స‌రం ఉంటుంద‌ని డాక్ట‌ర్ ఓ కాన‌ర్ తెలిపారు. కుడికాలి పాదంలో మ‌ధ్య‌భాగంలో ఉండే ఎముక‌లు స్వ‌ల్పంగా విరిగిన‌ట్లు డాక్ట‌ర్ కెవిన్ కాన‌ర్ తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments