Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి చితిపై కోడి మాంసం కాల్చుకుని భక్షించిన కసాయి కొడుకు

Webdunia
ఆదివారం, 31 జనవరి 2021 (16:51 IST)
నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని అత్యంత కర్కశంగా చంపేశాడో కసాయి కొడుకు. అంతటితో అతని కసి తీరలేదు. తల్లి శవాన్ని దహనం చేసేందుకు వెలిగించిన చితిపై కోడి మాంసం కాల్చుకుని ఆరగించాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భమ్ ప్రాంతానికి చెందిన ప్రధాన్ సోయ్ (35) అనే ఉన్మాది మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ప్రధాన్ పట్ల తల్లి సుమీ సోయ్ (60) ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
తల్లి తనను తిట్టడాన్ని భరించలేని ప్రధాన్ ఓ కర్రతో కొట్టడంతో ఆ వృద్ధురాలు మరణించింది. ఆపై తల్లి మృతదేహాన్ని తన ఇంటి పెరట్లో దహనం చేసేందుకు ప్రయత్నించాడు.
 
అంతేకాదు, తల్లి చితి మండుతుండగా, ఆ మంటల్లో కోడి మాంసం కాల్చుకుని తినడం అతని సోదరి సోమ్వారీ కంటబడింది. దాంతో ఆమె స్థానికులకు సమాచారం అందించడంతో, వారు పోలీసులకు విషయం తెలియజేశారు. 
 
పోలీసులు ప్రధాన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా, అతడు నాలుగేళ్ల కిందట తండ్రిని కూడా హత్య చేసినట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments