Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థికవేత్త ఎన్.‌కే సింగ్‌కు జపాన్ పురస్కారం 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రైజింగ్‌ సన్'

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (09:24 IST)
ప్రముఖ ఆర్థికవేత్త, రాజ్యసభ సభ్యుడు ఎన్.కే. సింగ్‌కు జపాన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రైజింగ్‌ సన్‌, గోల్డ్‌ ఆండ్‌ సిల్వర్‌ స్టార్' పురస్కారాన్ని ప్రకటించింది. జపాన్‌ రెండో అత్యున్నత గౌరవ పురస్కారం. దీన్ని ఆ దేశ ప్రధాని షింజో అబే మే 10న సింగ్‌కు ప్రదానం చేయనున్నారు. 
 
టోక్యోలోని రాజప్రసాదంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో చక్రవర్తి అకిహిటో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాల వృద్ధిలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నందుకు గుర్తింపుగా సింగ్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు జపాన్‌ ప్రకటించింది. సింగ్ జపాన్‌లో పనిచేస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం మారుతి సుజుకీ పెట్టుబడుల నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ దేశ వాహనరంగ సంస్థలు భారత్‌లో ప్రవేశించాయి. 
 
ఈ పురస్కారంపై ఆయన స్పందిస్తూ... '21వ శతాబ్దంలో ఆసియా పునరుజ్జీవనం ప్రధానంగా భారత్‌-జపాన్‌ సంబంధాలపైనే ఆధారపడి ఉంది' అని వ్యాఖ్యానించారు. 1981లో జపాన్‌తో ఏర్పడిన బంధం ఇన్నేళ్లలో బాగా బలపడింది. ఇరు దేశాల సంబంధాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్‌ ప్రధాని షింజో అబేల హాయంలోనే అత్యంత స్నేహపూర్వకంగా ఉన్నాయి అని వ్యాఖ్యానించారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments