Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగం కాదా?.. పాకిస్థాన్ వాగుడు..

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (11:35 IST)
దాయాది దేశం పాకిస్థాన్ హద్దులు దాటుతోంది. నోటికొచ్చినట్టుగా ఇష్టానుసారంగా వాగుతోంది. చివరికి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదన్న మాట పాపిష్టి పాకిస్థాన్ నోటి నుంచి వచ్చింది. ఇంతకాలం జమ్మూ-కాశ్మీర్‌ని వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వచ్చిన పాకిస్థాన్ ఇప్పుడు ఎవరి అండ చూసుకునే ఏమో తెలియదు కానీ, భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం కాదన్న మాటలు మాట్లాడుతోంది. 
 
కాశ్మీర్‌లోని వేర్పాటువాదులైన హురియత్ నాయకులతో భారతదేశంలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చర్చలు జరపడంతో భారత్ ఆగ్రహించింది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దాంతో పాకిస్థాన్‌ ఈ పొగరుబోతు మాటలు మాట్లాడుతోంది. 
 
పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తస్నిం అస్లాం స్పందిస్తూ ‘కాశ్మీర్ వేర్పాటు వాదులతో మాట్లాడటం భారతదేశ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం కాదు. చర్చల విరమణకు భారతదేశం దీన్నొక సాకుగా తీసుకుంటోంది. భారతదేశం అనుకుంటున్నట్టుగా కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం కాదు. అదొక వివాదాస్పద భూభాగం. దానిపై ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు.  

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments