Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‍‌ నెత్తిన పిడుగు.. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం ఉందన్న ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ కోమీ

అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పుచ్చె పగిలిపోయే పరిణామం జరిగిపోయింది. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ ఇవ్వాళ ట్రంప్ బండారాన్ని బయటపెట్టే విషయాలు వెల్లడించారు. అధ్యక్ష పీఠానికే ఎసరు తెచ్చేలా అమెరికా పరిణామాలను కోమీ సాక్ష్యం మార్చివేస

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (02:56 IST)
అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పుచ్చె పగిలిపోయే పరిణామం జరిగిపోయింది. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ ఇవ్వాళ ట్రంప్ బండారాన్ని బయటపెట్టే విషయాలు వెల్లడించారు. అధ్యక్ష పీఠానికే ఎసరు తెచ్చేలా అమెరికా పరిణామాలను కోమీ సాక్ష్యం మార్చివేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని రష్యా ప్రభావితం చేసిందని, ఈ విషయంపై ఎఫ్‌బీఐ చేస్తున్న దర్యాప్తును ఆపివేయాలని ట్రంప్ తనను కోరారని, అది ఆదేశంలాగే తాను భావించానని జేమ్స్ కోమీ సెనెట్‌ కమిటీకి స్పష్టం చేశారు. వాస్తవానికి అధ్యక్ష పదవి చేపట్టింది మొదలు ఏకపక్షంగా, స్వలాభం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అతని మెడకు చుట్టుకుంటున్నాయి. చివరకు అధ్యక్ష పీఠానికే ఎసరు తెచ్చేలా చకాచకా పరిణామాలు మారిపోతున్నాయి.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తును ట్రంప్‌ పరోక్షంగా ప్రభావితం చేశారని ఆరోపించిన ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ.. గురువారం సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు ఆ మేరకు బహిరంగంగా సాక్ష్యమిచ్చారు. ఎఫ్‌బీఐ అస్తవ్యస్తంగా తయారైందని, ఎఫ్‌బీఐ ప్రతినిధులు డైరెక్టర్‌ పట్ల నమ్మకాన్ని కోల్పోయారంటూ అమెరికా ప్రజలకు ట్రంప్‌ అబద్ధాలు చెప్పారు. చట్ట ప్రకారం ఎఫ్‌బీఐ డైరక్టర్‌ను తొలగించేందుకు ఎలాంటి కారణాలు అవసరం లేకపోయినా నన్ను తొలగించేందుకు చూపిన కారణాలు అతి సాధారణంగా ఉన్నాయి. నా గురించి అటార్నీ జనరల్స్‌ తో పాటు అనేక మందితో మాట్లాడానని, అద్భుతంగా పనిచేస్తున్నట్లు తేలిందని, ఎఫ్‌బీఐ బృందం కూడా నన్ను ఎంతో ఇష్టపడుతున్నట్లు ట్రంప్‌ నాకు చెప్పారు. అయితే మే 9న మాత్రం అందుకు వ్యతిరేకంగా నన్ను పదవి నుంచి తప్పించారు. నేను అద్భుతంగా పనిచేస్తున్నానని, నన్ను కొనసాగించాలని అనుకుంటున్నట్లు ట్రంప్‌ పదేపదే చెప్పారు.
 
2016 అధ్యక్ష ఎన్నికల్లో ఉద్దేశపూ ర్వకంగానే రష్యా జోక్యం చేసుకుందని సెనెట్‌ సభ్యులకు కోమీ స్పష్టం చేశారు. రష్యా జోక్యం అవాస్తవమని ట్రంప్‌ గతంలో చేసిన వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యా జోక్యంపై లభించిన ఆధారాలు నిజమేనని కోమీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ ఆపమని ఏ సందర్భంలోనైనా ట్రంప్‌ కోరారా అని సభ్యులు ప్రశ్నించగా.. లేదు అని కోమీ సమాధానమిచ్చారు. కేవలం ఫ్లిన్‌పై విచారణ ఆపమని మాత్రమే ట్రంప్‌ కోరినట్లు చెప్పారు. ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యాను. ఫ్లిన్‌పై విచారణను ఇంతటితో వదిలేయాలన్న విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నా.. ఫ్లిన్‌ను వదిలేయండి అని ట్రంప్‌ కోరార’ని కోమీ చెప్పారు.
 
ట్రంప్‌తో మొదటి సమావేశం నుంచి నా తొలగింపు వరకూ అధ్యక్షుడితో మీటింగ్‌ నోట్స్‌ తీసుకున్నాను. ట్రంప్‌తో చర్చించిన అంశాలపై ఆయన అబద్ధం ఆడవచ్చనే ఉద్దేశ్యంతో ముందే జాగ్రత్త పడ్డాను.  ట్రంప్‌తో వ్యక్తిగత సంభాషణాల్ని బయటపెడితే.. ట్రంప్‌ యంత్రాంగం చర్యల్ని విచారించేందుకు ప్రత్యేక కౌన్సిల్‌ నియమిస్తారని భావించి అలా చేశాను.  ట్రంప్‌పై ప్రత్యేకంగా మాత్రం ఎలాంటి విచారణ జరగలేదు.  అయితే ఈ కేసులో ట్రంప్‌ ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం.
 
ఎఫిబీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ అధ్యక్షుడితో తన సమావేశాల వివరాలను నోట్స్ రూపంలో భద్రపర్చినందున ట్రంప్ ఈ మొత్తం వ్యవహారంలో మాట మార్చడానికి కూడా వీల్లేకుండా పోయింది. అధ్యక్షుడి అభిశంసనకు కూడా దారి తీసే పరిణామాల్లో ట్రంప్ అడ్డంగా బుక్కైనట్లు తెలుస్తోంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం