Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో దాడులు జరిగే అవకాశముంది... ఇజ్రాయెల్ పౌరులకు హెచ్చరిక జారీ

కొత్త సంవత్సరం వేళ భారత్‌లో దాడులు జరుపవచ్చని ఇజ్రాయెల్ యాంటీ టెర్రరిజమ్ డైరెక్టరేట్ హెచ్చరించింది. అందువల్ల ఆ దేశంలో ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది.

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (10:33 IST)
కొత్త సంవత్సరం వేళ భారత్‌లో దాడులు జరుపవచ్చని ఇజ్రాయెల్ యాంటీ టెర్రరిజమ్ డైరెక్టరేట్ హెచ్చరించింది. అందువల్ల ఆ దేశంలో ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. 
 
భారత్‌లోని ఈశాన్య, పశ్చిమ ప్రాంతాల్లోని పర్యాటక స్థలాలు లక్ష్యంగా తీవ్రవాద దాడులు జరగవచ్చని కౌంటర్ టెర్రరిజమ్ బ్యూరో పక్షాన ఇజ్రెయెల్ ప్రధానమంత్రి కార్యాలయం హెచ్చరించింది. ప్రత్యేకంగా బీచ్‌లు, క్లబ్ పార్టీల్లో జరిగే కొత్త సంవత్సర వేడుకలు లక్ష్యంగా దాడులు జరగవచ్చని ఆ దేశం పేర్కొంది. ఇజ్రాయెల్ పౌరులు కొత్తసంవత్సర పార్టీల్లో పాల్గొనవద్దని కోరింది. దేశంలో జనసమ్మర్ధంగా ఉండే మార్కెట్లు, పండగలు, షాపింగ్ ప్రాంతాల్లో తిరగవద్దని సూచించింది.
 
హాలీడే స్పాట్‌లుగా పేరొందిన గోవా, పూణే, ముంబై, కొచ్చిన్ నగరాల్లో ముప్పు ఎక్కువగా ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ దేశం చేసిన హెచ్చరికను న్యూఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం నిర్ధారించింది. ఇజ్రాయెల్‌కు చెందిన 20 వేల మంది పౌరులు ప్రతిఏటా భారత్‌ను సందర్శిస్తుంటారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments