Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ రూటు మార్చింది: అమ్మకానికి కన్యలంటూ వాట్సాప్‌లో ప్రకటనలు.. 12,500 డాలర్లకు..?!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తమ వద్దనున్న బందీలను క్యాష్ చేసుకోవాలని కొత్త మార్గాన్ని కనిపెట్టింది. ఆత్మాహుతి దాడులతో విధ్వంసం సృష్టించడం తమకు దొరికిన జర్నలిస్టులు.. ఇతర బందీలను కిరాతక

Webdunia
బుధవారం, 6 జులై 2016 (17:25 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తమ వద్దనున్న బందీలను క్యాష్ చేసుకోవాలని కొత్త మార్గాన్ని కనిపెట్టింది. ఆత్మాహుతి దాడులతో విధ్వంసం సృష్టించడం తమకు దొరికిన జర్నలిస్టులు.. ఇతర బందీలను కిరాతకంగా చంపేసే ఐఎస్.. తమ వద్దనున్న అందమైన అమ్మాయిలను అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు అమ్మకానికి అందమైన కన్యలంటూ వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లో ప్రత్యక్షమైన ప్రకటనలు కలకలం రేపాయి. 
 
అరబిక్ భాషలో ఉన్న వీటిని ఐఎస్ఐఎస్ పోస్ట్ చేసింది. ఉత్తర ఇరాక్‌లో పట్టును కోల్పోయిన ఐఎస్.. బందీలుగా ఉన్న సుమారు 3వేల మంది మహిళలు, బాలికలపై పట్టుబిగించింది. వ్యభిచార బానిసలుగా వీరిని కాపాడే కుర్దీష్ స్మగ్లర్ల నుంచి తమ ఆధీనంలో పెట్టుకోవాలనుకుంది. ఇందులో భాగంగా మహిళలు, బాలికల వివరాలు, ఫోటోలతో పాటు ఎవరి ఆధీనంలో ఉన్నారన్నదానిపై ఓ డేటాబేస్‌తో కూడిన యాప్‌ను ఐఎస్ తయారు చేసింది. 
 
ఈ యాప్ ద్వారా ఎవరైనా తప్పించుకుంటే మిగతా వారికి వెంటనే ఆ సమాచారం తెలిసిపోతుంది. ఈ డేటాబేస్‌ను ఐఎస్ మరో విధంగా వినియోగించుకుంటోంది. అంతేగాకుండా ప్రస్తుతం డబ్బుల్లేకుండా కష్టాల్లో ఉన్న ఐఎస్.. నగదును కూడబెట్టుకునేందుకు మహిళా బందీలను ఉపయోగించుకోవాలనుకుంటుంది. దీంతో డబ్బులు కూడ బెట్టేందుకు తమ వద్ద వ్యభిచార బానిసలుగా ఉన్న మహిళలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. 12 ఏళ్ళ బాలికలను కూడా అందమైన కన్యలుగా పేర్కొంటూ.. 12,500 డాలర్లకు అమ్మకానికి పెట్టేసింది. వీరి ఫోటోలు, వివరాలతో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లో ఐఎస్ ప్రకటనలు ఇస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం