Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహాది పెళ్ళి... బోనులో పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (16:35 IST)
నుదుటన గన్ను పెట్టి టపీ టపీ పేల్చడం తప్ప మరోటి తెలదనుకున్న ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు పెళ్లి బాజాలు మోగించారు. ఓ జంటకు తమదైన శైలిలో పెళ్లి చేసి సామాజిక కార్యక్రమంలో మేమున్నామని చాటుకున్నారు. అయితే అందులోనూ తమ మార్కు చూపారు. కత్తులు కటార్లతో వివాహా కార్యక్రమాన్ని ఓ బోనులాంటి వేదికపై చేయడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. 
 
ఈజిప్టులోని మెనోఫియాఅనే నగరంలో ఈ మధ్య ఓ వెరైటీ పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఈ వెడ్డింగ్ నిర్వహించడం మరీ విశేషం. తమ చరలో ఉన్న బందీల తలలు నరికడం, రక్తం కళ్ళ చూడడం వారికి తెలిసిన విద్య. ఎప్పుడు ఇలా చేసి చేసి బోర్ కొట్టేసిందేమో ఒక్క సారిగా పెళ్లి చేసి పెళ్లి పెద్దలు అయిపోయారు. తీవ్రవాదులు కత్తులతోనే పెళ్లి కొడుకును, పెళ్లి కూతురిని ఓ బోను దగ్గరకు సాదరంగా తోడ్కొని వచ్చి అందులోనే పెళ్లి జరిపించారు. 
 
ముఖానికి నల్లని మాస్క్ ధరించిన ఓ యువకుడు..వధూవరుల్ని బోను దగ్గరకు తీసుకువచ్చి జిహాదీ గీతంలాంటి పాట ఆలపిస్తూ పెళ్లి జరిపించాడు. వచ్చిన జిహాదీలంతా గళం కలుపు తుంటే, వధూవరులు, వాళ్ళతోబాటు వచ్చినోళ్ళు అంతా ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ఇంకో విశేషం. 
 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments