Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నాప్ చేసిన భారతీయ టీచర్లను ఎందుకు వదిలిపెట్టారో తెలుసా?

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (14:08 IST)
సిరియాలో నలుగురు భారతీయ ఉపాధ్యాయులను కిడ్నాప్ చేసిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) వారిలి ఇద్దరిని ప్రాణాలతో వదిలివేయడానికి ఓ కారణం ఉందట. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులంటే ఇసిస్ ఉగ్రవాదులకు ఎనలేని గౌరవమట. ఈ విషయాన్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ప్రాణాలతో బయటపడిన ఉపాధ్యాయులు చెపుతున్నారు. 
 
ఇసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన వారిలో కర్ణాటక, కోలార్ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ విజయ్ కుమార్ ఉన్నారు. ఈయన కిడ్నాప్‌పై స్పందిస్తూ.. తమను బంధించిన తర్వాత ఓ చీకటి గదిలో ఉంచారని, ఒక రాత్రి అన్నం పెట్టలేదని, తమ పేర్లు, మతం, ఉద్యోగాల వివరాలు అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు. తాము వర్శిటీ అధ్యాపకులమని తెలుసుకున్న తర్వాత తమ పట్ల వారి వైఖరి మారిందని తెలిపారు.
 
తన పేరు షేక్ అని చెప్పుకున్న ఉగ్రవాద నాయకుడు, టీచర్లంటే తమకెంతో గౌరవమని, తమను చంపబోమని చెప్పినట్టు వివరించారు. ఇస్లాం గురించి ఏం తెలుసో చెప్పాలని ఆయన ప్రశ్నించాడని, భారత్‌లో మత సామరస్యం గురించి వివరంగా చెబితే సంతోషించాడన్నారు. కాగా, మొత్తం నలుగురిని కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు ఇద్దరిని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు తెలుగువారు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments