హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

ఠాగూర్
ఆదివారం, 22 జూన్ 2025 (19:57 IST)
ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా దేశాలు జరుపుతున్న వరుస దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరైపోతుంది. దీంతో ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ముందుగా హెచ్చరించినట్టుగానే హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఇందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం కూడా తెలిపింది. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌తో పాటు అనేక దేశాల్లో చమురు దిగుమతులకు అంతరాయం ఏర్పడి, వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. తమపై దాడి చేస్తున్న శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ అవసరాల్లో 20 శాతం హర్మూజ్ ద్వారానే రవాణా అవుతోంది. అరేబియా సముద్రంలో ఒమన్‍‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం - ఇరాన్‌ల మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి కావడం గమనార్హం. ఇది ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల బారెళ్ల ముడి చమురు వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ ఇలా అనేక దేశాలకు చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అలాగే, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఇపుడు ఈ జలసంధిని మూసివేయడంతో పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్‌కు కొరత ఏర్పడి వీటి ధరలు పెరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments