దాడికి ప్రయత్నిస్తే అది శత్రువుల జీవితంలో అతిపెద్ద తప్పు అవుతుంది : ఇరాన్ వార్నింగ్

ఠాగూర్
ఆదివారం, 19 ఏప్రియల్ 2026 (10:28 IST)
పశ్చిమాసియాలో మరోమారు యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికాకు ఇరాన్ మరోమారు గట్టివార్నింగ్ ఇచ్చింది. తమపై దాడి చేస్తే ప్రతిదాడి ఊహకు అందని విధంగా ఉంటుందని హెచ్చరించింది. తమపై దాడికి ప్రయత్నిస్తే అది శత్రువుల జీవితంలో అతిపెద్ద తప్పు అవుతుందని అమెరికాకు ఇరాన్ తెలిపింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
 
తమ జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని, పూర్తి బలంతో విరుచుకుపడతామని ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు హెచ్చరించారు. ముందుగా ఎవరిపైనా దాడి చేయబోమని, కానీ తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే మాత్రం ప్రతిస్పందన ఊహకు అందదని తేల్చి చెప్పారు. ఇప్పటికే కీలక ప్రాంతాల్లో క్షిపణి వ్యవస్థలను మొహరించినట్టు ఇరాన్ వెల్లడించింది. 
 
కొంతకాలంగా ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమాలను, రక్షణ ఒప్పందాలపై అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. దీనికితోడు పశ్చిమాసియాలోని కీలక జల సంధుల్లో అమెరికా నౌకాదళం గస్తీ  పెంచడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ తన సైనిక శక్తి ప్రదర్శిస్తూ అత్యాధునిక డ్రోన్లు, సుదూర క్షిపణులను ప్రదర్శనకు ఉంచుతుంది. 
 
ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐక్యరాజ్య సమితి శాంతియుత పరిష్కారానికి పిలుపునిస్తున్నప్పటికీ ఇరు దేశాలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి

సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు

Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్

Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్

Tharun Bhascker: జింగాలా సాంగ్ కు డాన్స్ వేసిన గాయపడ్డ సింహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments