Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశంలో ఎందుకుంటున్నావ్.. వెళ్లిపో... న్యూయార్క్‌ రైల్లో భారతీయ మహిళకు బెదిరింపు

అమెరికాలో మరో భారతీయ మహిళలకు బెదిరింపులు వచ్చాయి. మా దేశంలో ఎందుకుంటున్నావ్.. మీ దేశానికి వెళ్లిపో అంటూ ఓ నల్ల అమెరికా ఉన్మాది బెదిరించాడు. కెన్సాస్‌లో భారతీయ ఇంజనీర్‌ను కాల్చి చంపిన ఘటన మరువకుముందే ఈ

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (09:19 IST)
అమెరికాలో మరో భారతీయ మహిళలకు బెదిరింపులు వచ్చాయి. మా దేశంలో ఎందుకుంటున్నావ్.. మీ దేశానికి వెళ్లిపో అంటూ ఓ నల్ల అమెరికా ఉన్మాది బెదిరించాడు. కెన్సాస్‌లో భారతీయ ఇంజనీర్‌ను కాల్చి చంపిన ఘటన మరువకుముందే ఈ బెదిరింపు రావడం గమనార్హం.
 
న్యూయార్క్ మెట్రో రైల్లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... భారత్‌కు చెందిన ఏక్తా దేశాయ్ అనే మహిళ న్యూయార్క్ మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నది. ఆ సమయంలో తన సీటు పక్కలోనే కూర్చొన్న ఆఫ్రో అమెరికన్‌ జాతి వివక్ష ప్రదర్శించాడు. 
 
హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటున్న ఆమె తన మొహం మీదకు అమెరికన్‌ వచ్చి అరుస్తున్నా తొలుత పట్టించుకోలేదు. ప్రవర్తన తీవ్రంగా ఉండటంతో హెడ్‌ఫోన్లు తీసేసింది. అప్పుడు వాడు ‘మీ దేశానికి వెళ్లిపో’ అని హూంకరించాడు. ‘నన్ను తాకొద్దు’ అని హెచ్చరించినా వినకుండా బెదిరిస్తూ.. భయపెడుతూ.. మీది మీది కొచ్చి సభ్యసమాజం తలదించుకునే రీతిలో అసభ్యకరమైన భాషలో బూతులు తిట్టాడు. 
 
ఎక్తా దేశాయ్‌ రియాక్ట్‌ కాకపోవడంతో అతను పక్కనున్న ఆసియన్‌ మహిళ మీద తన తిట్ల ప్రతాపం చూపించాడు. అతడి విద్వేషాన్నంతటినీ కెమెరాలో చిత్రీకరించిన ఎక్తా దేశాయ్‌ మొదట దాన్ని బయట పెట్టలేదు. కాన్సస్‌లో జాతి విద్వేష దాడిలో శ్రీనివాస్‌ మరణం తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అతను అసభ్యంగా ప్రవర్తించిన పావు గంటలకు అక్కడికి పోలీసులు వచ్చారని, వారేమీ అతనిపై చర్య తీసుకోలేదని పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments