Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో పత్రికలు మరీ అతి చేస్తున్నాయట.. అమెరికాలో అంత టెన్షనేమీ లేదట.. సిగ్గూ ఎగ్గూ ఉందా?

బారతీయ మీడియా అనవసరంగా ఇలాంటి దాడుల గురించి ఆకాశానికెత్తుతున్నాయని కానీ ఇక్కడ అమెరికాలో అంత సీన్ లేదని, ఇక్కడ సూర్యుడు ఉదయంచడం, పొద్దుపొడవటం ఏమాత్రం తేడా లేకుండా సజావుగా సాగిపోతోందని, మీడియా హైప్ అతి చేయడం తప్ప అమెరికాలో దీన్ని పట్టించుకునేవారే లేరని

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (06:14 IST)
కూచిబొట్ల శ్రీనివాస్‌ను నిష్కారణంగా ఒక జాతీయ దురహంకారి కన్నూ మిన్నూ గానని ఉన్మాదంతో నిలువునా కాల్చ చంపిన ఘటనకు భారతీయ మీడియా ఉత్తరాది, దక్షిణాది భేదం లేకుండా తొలిసారి అత్యంత అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రాచుర్యం ఇచ్చింది. సోషల్ మీడియాలో అయితే ఇది ట్రెండ్ అయింది. ఒక మామూలు వ్యక్తి, ఎలాంటి పలుకుబళ్లూ లేని, మంచి జీవితం గడపాలన్న చిరు ఆశ తప్ప మరే పెద్ద కోరికలూ లేని శ్రీనివాస్ దారుణ హత్య పట్ల భారత్ ముక్తకంఠంతో ఖండించింది. సునయనకు కన్నీటి నీరాజనంతో సాంత్వన పలికింది. 

 
కానీ అదే సమయంలో కొంతమంది ఎన్నారైలు సోషల్ మీడియాలో కొత్తరాగం అందుకున్నారు. అబ్బే బారతీయ మీడియా అనవసరంగా ఇలాంటి దాడుల గురించి ఆకాశానికెత్తుతున్నాయని కానీ ఇక్కడ అమెరికాలో అంత సీన్ లేదని, ఇక్కడ సూర్యుడు ఉదయంచడం, పొద్దుపొడవటం ఏమాత్రం తేడా లేకుండా సజావుగా సాగిపోతోందని, మీడియా హైప్ అతి చేయడం తప్ప అమెరికాలో దీన్ని పట్టించుకునేవారే లేరని.. ఇలా ఒకటా రెండా.. ట్రంప్ కంపు నోటికి మించిన బండకూతలతో ఇలాంటి వారు సోషల్ మీడియాలో వాంతి చేసుకున్నారు. 
 
చేయని నేరానికి 30 ఏళ్లలోపే జీవితానందాన్ని కోల్పోయిన సునయనను కొందరు భ్రష్టులు ఘోరాతిఘారంగా అవమానించారు. జీవన సహచరుడిని కోల్పోయి పిడుగుపాటుకు గురైన స్థితిలో సునయన తన భర్త జ్ఞాపకాలను పంచుకుని బాధను వ్యక్తం చేస్తూ నాలుగు మాటలు ఫేస్ బుక్‌లో మొట్టమొదటి పోస్టులో రాసుకుంటే అనరాని మాటలతో ఆమెను గాయపర్చారు. కొన్ని వేలమంది విదేశీయులు. ఆమె గురించి ఏమాత్రం తెలీనివారు కూడా ఆమెకు వచ్చిన కష్టం గురించి విని ఆమె పోస్టులో సాంత్వన పలికి ఓదార్చితే.. మనవాళ్లు.. దేశభక్తిని గుత్తకు తీసుకున్నవారు.. మోదీ భజనతో సోషల్ మీడియాను ఉద్ధరిస్తున్న వారు.. మన సునయనను మాటలతో కుళ్లబొడిచేశారు. భర్తను కోల్పోయిన ఆమె ఒళ్లో ఏమాత్రం కష్టపడకుండా ఆరు కోట్లరూపాయలు వచ్చిపడ్డాయట. ఆ డబ్బుల్తో కులకడానికి ఆమె అమెరికా వెళుతోందట. రెండేళ్లలో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని అన్నీ మర్చిపోతుందట.. 
 
ఇది మన వాళ్ల సంస్కారం. ఇలాంటి భ్రష్ట సంజాతుల మాటలను ఉప్పురాతికి ఇచ్చే విలువ కూడా ఇవ్వకూడదని కొందరు వ్యాఖ్యానించారు. ఇలాంటి హీన సంస్కారుల వ్యాఖ్యలతో వాదాలు, వివాదాలు ఆ పేరుతో మళ్లీ ఒక కొత్త యుద్ధవాతావరణం.. ఒకటి మాత్రం నిజం. సంస్కారం అన్నది పుట్టినప్పుడే మర్చిపోయి ట్విట్టర్ వంటి సోషల్ మీడియాను ఉద్ధరిస్తున్న వారి రాతలకు పూచిక పుల్లంత విలువు కూడా ఇవ్వొద్దన్న మాట నిజమే. కానీ ఒక బాధితురాలి తనువునూ, మనస్సునూ కుళ్ల బొడుస్తూ కామెంట్లు వెట్టే హక్కు ఎవరిచ్చారు? 
 
పైగా స్వేచ్చామాత విగ్రహం సాక్షిగా అమెరికా ప్రశాంతంగా ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నవారు మొన్న శ్రీనివాస్, నిన్న సిక్కుయువకుడు, మరొకరు అన్యాయంగా దెబ్బతినిపోతోంటే ఇక్కడంత సీన్ లేదు. ఏమీ జరగలేదు అంటూ చెబుతున్నారంటే. తమదాకా వస్తే కానీ ఆ బాధ ఎలాంటిదో అనుభవించలేరనిపిస్తోంది. అమెరికాలో జాతి విద్వేషం పరాకాష్టకు చేరుతున్న ప్రస్తుత తరుణంలో ఏ భారతీయుడూ, ఇతర జాతుల వారు కూడా విద్వేషానికి బలి కాకూడదని కోరుకుందాం. కానీ ఇక్కడ అంతా పారా హుషార్ అంటున్న వారికి కాస్త జ్ఞానోదయం కలగాలని, ఒక అవాంఛిత మరణం కుటుంబాన్ని మొత్తంగా ఎలా ఛిద్రం చేస్తుందనే జ్ఞానం వారికి కొత్తగా కలగాలని ఆశిద్దాం. 
 
అమెరికాలో అంతా బాగుందని భ్రమల్లో బతుకుతున్నవారు కింది వార్తలు చూస్తే అన్నా వారి గుండె కరుగుతుందేమో చూడాలి.
 
అమెరికాలో భారతీయులపై విద్వేషపూరిత ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్న కాన్సస్‌లో శ్రీనివాస్‌ కూచిభొట్ల.. నిన్న దక్షిణ కరోలినాలో హర్నీశ్‌ పటేల్‌పై దాడులు జరగ్గా ఇప్పుడు మరో భారతీయుడిపై జాత్యహంకార తూటా పేలింది. తాజాగా, న్యూయార్క్‌లో భారత–అమెరికన్‌ దీప్‌ రాయ్‌ (39) అనే సిక్కు యువకుడిపై ముసుగువేసుకున్న ఆగంతకుడు ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని అరుస్తూ కాల్పులు జరిపాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటిముందు కారు వద్ద నిలబడ్డ దీప్‌ రాయ్‌ దగ్గరకు వచ్చిన ఆగంతకుడు కాసేపు వాగ్వాదం తర్వాత కాల్పులు జరిపాడని కెంట్‌ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆగంతకుడు గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపి పారిపోయాడన్నారు. దీంతో బాధితుడి భుజంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిందని కెంట్‌ పోలీస్‌ కమాండర్‌ జరోడ్‌ కేస్నర్‌ వెల్లడించారు. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అందుకే ఎఫ్‌బీఐతోపాటు ఇతర ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు ఆగంతకుడి కోసం గాలిస్తున్నామన్నారు. ‘దేశంలో ఇటీవల నెలకొన్న అనిశ్చితి, ఆందోళనకు కొందరు అమెరికన్లు ఎమోషనల్‌గా స్పందించటమే కారణమనిపిస్తోంది. అవతలి వ్యక్తి రంగు, ప్రాంతం ఆధారంగా నేరానికి పాల్పడటం సరికాదు’ అని కేస్నర్‌ తెలిపారు.
 
భారతీయ–అమెరికన్లలో ఆందోళన
వరుస విద్వేషపూరిత ఘటనలతో భారత అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ‘పరిస్థి తులు చాలా భీకరంగా ఉన్నాయి. రోజురో జుకూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. బహి రంగ ప్రదేశాల్లోనూ వ్యక్తిగత ప్రదేశాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వర్ణవి వక్ష దూషణలు, విద్వేషపూరితమైన చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని భారత– అమెరికన్‌ డెమోక్రటిక్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడిం చింది. కాన్సస్, న్యూయార్క్, వాషింగ్టన్‌లలో జరిగిన మూడు ఘటనల్లోనూ బాధ్యులు ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని గట్టిగా అరుస్తూ దాడులకు దిగటం ద్వారా ఇవి విద్వేషపూరిత ఘటనలేనని భావిస్తున్నామని తెలిపింది. భారతీయుల హక్కులను కాపాడేందుకు, భద్రతపై భరోసా ఇచ్చేందుకు నాయకులు, సంఘాలను కలుపుకుని ముందుకెళ్తామని ఇండియా సివిల్‌ వాచ్‌ అనే సంస్థ తెలిపింది.
 
దీప్‌రాయ్‌ ఘటనను విద్వేషపూరిత ఘటనగా గుర్తించి విచారణ జరపాలంటూ అమెరికా సిక్కు సంఘాలు డిమాండ్‌ చేశాయి. అమెరికాలోని సిక్కులపై ఇటీవల వేధింపులు, దాడులు ఎక్కువయ్యాయని రెంటాన్‌ ప్రాంత సిక్కు వర్గం నేత జస్మీత్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఘటనతో అతని కుటుంబంతో పాటు భార తీయ అమెరికన్లలో ఆందోళన పెరిగిందన్నారు. ‘సెప్టెంబర్‌ 11’ ఘటన తర్వాత గురుద్వా రాలు, సిక్కు సమాజంపై దాడులు జరుగు తూనే ఉన్నాయని తెలిపారు. ‘అయితే అప్పట్లో శాంతి భద్రతలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వటంతో కాస్త ధైర్యంగా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి’ అని జస్మీత్‌ సింగ్‌ వెల్లడించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments