Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో సుహేల్ పుస్తకావిష్కరణ: హాజరైన విజయ్ మాల్యా.. పిలవలేదట.. ట్విట్టర్లో..?

రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కుంటూ స్వదేశం నుంచి లండన్‌ను జంప్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారని వార్తలొస్తున్నాయి. భారత్ వది

Webdunia
శనివారం, 18 జూన్ 2016 (17:50 IST)
రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కుంటూ స్వదేశం నుంచి లండన్‌ను జంప్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారని వార్తలొస్తున్నాయి. భారత్ వదిలి మాల్యా లండన్‌కు వెళ్ళిపోయారని.. అక్కడ ఆయన హాయిగా తన జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతున్నారని మీడియా కోడైకూస్తోంది. 
 
తాజాగా లండన్‌లో ‘మంత్రాస్ ఫర్ సక్సెస్’ అనే పుస్తకాన్ని రచయిత సుహేల్ సేథ్.. జర్నలిస్టు సన్నీ సేన్‌తో కలిసి రాశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భారత హై కమిషనర్ నవతేజ్ సర్నా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాల్యా హాజరయ్యారని.. ప్రేక్షకుల్లో ఒకరుగా కూర్చున్నారని తెలిసింది. 
 
కానీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి ఎవరికీ ఆహ్వానాలు పంపించలేదని, ట్విట్టర్ ద్వారా మాత్రమే ప్రచారం చేశామని చెప్పారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజరుకావచ్చని చెప్పామన్నారు. దీంతో మాల్యా ఈ కార్యక్రమానికి వచ్చారని, ప్రేక్షకుల్లో కూర్చుని కార్యక్రమాన్ని చూశారని సుహేల్ సేథ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి మాల్యా హాజరు కావడాన్ని గమనించిన నవతేజ్ కార్యక్రమం పూర్తికాకుండానే వెళ్లిపోయారని సేథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments