Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎబోలా వైరస్ సోకిన భారతీయుడు మృతి

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (16:10 IST)
ఎబోలా వైరస్ సోకిన భారతీయుడు మహ్మద్ అమీర్ బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ ధృవీకరించింది. లైబీరియాలో ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న అమీర్ ఈ నెల 10వ తేదీన భారత్‌కు వచ్చాడు. 
 
ఢిల్లీ విమానాశ్రయంలో అతనికి ఎబోలా పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు లైబీరియాలో నిర్వహించిన రక్త పరీక్షల్లో అతనికి ఎబోలా లేదని తేలింది. 
 
అయితే వీర్యం నమూనాల పరీక్షల్లో ఎబోలా లక్షణాలు కనిపించడం‌తో భారత అధికారులు అతన్నివిమానాశ్రయంలోనే ప్రత్యేక ఏర్పాటుతో విడిగా ఉంచి చికిత్స అందించారు.
 
ఈ స్థితిలో అతని పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా దేశంలో ఇదే తొలి ఎబోలా కేసుగా భావిస్తున్నారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments