Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులభూషణ్ జాదవ్‌ను కలిసేందుకు రెండో ఛాన్స్ ఇవ్వం-పాక్ సంచలన నిర్ణయం

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (15:59 IST)
పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అదే భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు భారత దౌత్య కార్యాలయ అధికారులకు అవకాశం ఇవ్వబోమని తేల్చేసింది. ఈ మేరకు పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ సెప్టెంబర్ 2న కుల్‌భూషణ్‌ను కలిసేందుకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. 
 
పాకిస్థాన్ జైలులో వున్న జాదవ్‌తో భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా సెప్టెంబర్ రెండో తేదీన గంట పాటు సమావేశం అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. 
 
గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2016, మార్చి 3న జాదవ్‌ను బలూచిస్తాన్‌లో పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments