Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్‌ తల, చెవి, మెడ వద్ద గాయాలు.. పాక్‌పై మండిపాటు

గూఢచర్యం చేశారనే ఆరోపణలతో మరణశిక్ష పడి.. ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో వున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను ఆయన కుటుంబీకులు కలిశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కుమారుడిని కలిసేందుకు కుల్‌భూషణ్ త

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (09:15 IST)
గూఢచర్యం చేశారనే ఆరోపణలతో మరణశిక్ష పడి.. ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో వున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను ఆయన కుటుంబీకులు కలిశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కుమారుడిని కలిసేందుకు కుల్‌భూషణ్ తల్లికి, భార్యకు పాకిస్థాన్ అధికారులు అనుమతి ఇచ్చారు. జాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునేలా ఫోటోలు తీశారు. జాదవ్.. ఆయన కుటుంబీకులు మధ్యలో అద్దాన్ని అడ్డుగా పెట్టి మాట్లాడుకునేలా ఏర్పాట్లు చేశారు. 
 
ప్రస్తుతం ఆ ఫోటోలు పాకిస్థాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి వెల్లడించాయి.  కుల్‌భూషణ్‌ను చిత్రహింసలకు గురిచేసినట్టు ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన తల, చెవి భాగంలో, మెడ వద్ద గాయాలు కనిపిస్తున్నాయి. ఆయన పెట్టుకున్న చెవిపోగు కూడా కనిపించడం లేదు. దీంతో పాకిస్థాన్ జైలు అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫొటోలు చూస్తుంటే కుల్‌భూషణ్‌ను చిత్రహింసలకు గురి చేసింది నిజమే అనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ, గతంలో ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా పనిచేసిన శశిథరూర్ అనుమానం వ్యక్తం చేశారు. 
 
కాగా, గూఢచర్యం నెపంతో పాక్ జాదవ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కమాండర్ కుల్ భూషణ్ జాదవ్‌కు పాక్ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ శిక్ష అమలుపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments