Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

ఠాగూర్
బుధవారం, 23 జులై 2025 (13:37 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ విమానాలు తన గగనతలాన్ని ఉపయోగించకుండా నిషేధాన్ని పొడగించింది. ఆగస్టు 23వ వరకు పాక్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్ (ట్విట్టర్)లో ఈ విషయాన్ని తెలియజేశారు.
 
“పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా పరిమితం చేస్తున్న ఎయిర్ లైన్ నోటీసు (NOTAM)ను అధికారికంగా ఆగస్టు 23 వరకు పొడిగించడం జరిగింది. ప్రస్తుత భద్రతా ప్రోటోకాలు అనుగుణంగా ఇది ఉంటుంది" అని మంత్రి తెలిపారు.
 
దాయాది దేశం తన గగనతలంలో భారతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ గత వారం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి భారత్ ఈ చర్య తీసుకుంది. ఆగస్టు 24 వరకు భారత ఎయిర్ లైన్స్ బ్యాన్‌ను పొడిగించినట్లు పాకిస్థాన్ ఎయిర్ పోర్టు అథారిటీ (పీఏఏ) గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలన్నింటికీ వర్తిస్తుందని తెలిపింది. ఈ బ్యాన్ ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) అమలులో ఉంటుందని పీఏఏ తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments