Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ రేటును మించిపోయిన పాల ధర.. లీటరు పాలు రూ.140.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (13:18 IST)
పాకిస్థాన్‌ ఆర్థికసంక్షోభంలో కూరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిని నిజం చేసేలా ఇపుడు ఆ దేశంలో లీటరు పాల ధర లీటరు పెట్రోల్ కంటే పెరిగిపోయింది. పాకిస్థాన్‌లో లీటరు పెట్రోలు ధర రూ.113గా ఉండగా, డీజిల్ ధర రూ.91గా ఉంది. కానీ, లీటరు పాల ధర రూ.140కు చేరుకుంది. దీంతో జనం గగ్గోలుపెడుతున్నారు. 
 
నిజానికి లీటరు పాల ధర రూ.50 నుంచి రూ.60కి మించదు. కానీ, ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, కరాచి లాంటి నగరాల్లో పాల ధర పెట్రోల్, డీజిల్ ధరలను మించిపోయింది. మంగళవారం మొహర్రం సందర్భంగా పాక్‌లో లీటర్ పాల ధర 120-140 రూపాయలు వరకు పలికింది. 
 
సాధారణంగా మొహర్రం రోజున పాల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే డిమాండ్ ఆ విధంగా ఉంటుంది. కానీ, ఈ తీరుగా పెరగడం ఇదే ప్రథమమని స్థానికులు అంటున్నారు. పవిత్ర మొహర్రం సందర్భంగా ముస్లింలు పాలతో వివిధ రకాలైన పానియాలు(షరబత్ లాంటివి), వంటకాలు తయారు చేసి ప్రజలకు పంచుతారు. దీంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments