Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

ఠాగూర్
సోమవారం, 20 మే 2024 (11:18 IST)
కెనడాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో అంత్యక్రియల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తమ బంధువులకు అంత్యక్రియలు చేయలేక శవాలను అనాథలుగా వదిలివేస్తున్నారు. అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ.30 లక్షలు దాటుతుండడమే అందుకు కారణం. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది.
 
దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు.
 
కెనడాలో అంత్యక్రియలకు సగటున 30 వేల డాలర్లకు పైనే అవుతోంది. గ్రేటర్ టొరొంటోలో అయితే ఇది 34 వేల డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు రూ.27 లక్షలు. ఇది ఒక్క అంత్యక్రియల నిర్వహణ ఖర్చు మాత్రమే. ఇతర ఖర్చులు కూడా కలుపుకొంటే రూ.30 లక్షలు దాటేస్తోంది. ఇంతింత ఖర్చును భరించలేని కుటుంబాలు తమవారి మృతదేహాలను అనాథల్లా వదిలిపెట్టేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments