ఉన్నట్టుండి ముదురు నీలం రంగులోకి శునకాలు మారిపోయాయి. మూతపడ్డ కెమికల్ ప్లాంట్ సమీపంలో ఈ బ్లూ డాగ్స్ తిరుగుతున్నాయని అంటున్నారు. అసలు ఎందుకిలా కుక్కలు నీలం రంగులోకి మారిపోయాయి. వాటిపై జుట్టంతా నీలం రంగులో కనిపిస్తుందో అంతుపట్టడం లేదంటున్నారు. రష్యాలోని డిజెర్జిన్స్ ప్రాంత నివాసులంతా వింత దృశ్యాన్ని చూసి షాకవుతున్నారు.
దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదో సైన్స్ ఫిక్షన్, రేడియేషన్ ప్రభావిత మ్యుటేసన్ మాదిరిగా కనిపిస్తోంది. కెమికల్ ప్లాంట్ నుంచి విడుదలైన విష రసాయనాల కారణంగానే ఈ కుక్కలన్నీ ఇలా నీలం రంగులోకి మారిపోయాయని అంటున్నారు.
గతంలో 2015లో మూసివేసిన ఆర్గ్‌స్టెక్లో యాజమాన్యంలో కర్మాగారం ప్లెక్సిగ్లాస్ హైడ్రోసియానిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుండేది. కెమికల్ తయారీలో ఉపయోగించే రాగి సల్ఫేట్‌కు కుక్కలు బహిర్గతమయ్యే అవకాశం ఉందంటున్నారు. లేత-నీలం రంగు కుక్కల జుట్టుపై రాగి సల్ఫేట్ ద్రావణం అంటుకోవడం ద్వారా ఇలా మారి ఉండొచ్చునని చెబుతున్నారు.