Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మహిళను కన్నీరు పెట్టించిన పుల్వామా... మానవత్వాన్ని కుదువ పెట్టలేం...

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:51 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ పాలకులకు చీమకుట్టినట్టుగా కూడా లేకపోయినప్పటికీ.. ఆ దేశానికి చెందిన ఓ మహిళను కదిలించింది. ఫలితంగా ఆమె కన్నీరు పెట్టింది. భారత్‌పై వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న గడ్డపై పుట్టి పెరిగిన అమ్మాయి. పేరు సెహీర్‌ మీర్జా. ఆమె ఓ జర్నలిస్టు. 
 
పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. అంతేనా.. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బాహాటంగానే ప్రకటించారు. పైగా, భారత్‌కు మద్దతుగా 'యాంటీ హేట్‌ చాలెంజ్‌'ను చేపట్టింది. "దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేం" అంటూ తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకుంది. దాని కింద.. "నేను పాక్‌ అమ్మాయిని. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను" అనే ప్లకార్డుతో కూడిన పోస్ట్‌ చేసింది. 
 
ఇపుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది పాక్ పౌరులు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. భారత్‌-పాక్‌ మధ్య స్పర్థలు పోయి.. శాంతినెలకొనాలని చాన్నాళ్లుగా సెహీర్‌ మీర్జా పోరాడుతోంది. అలాగే, భారత్‌ ప్రభుత్వం కూడా పాకిస్థానత్ పీచమణిచేలా చర్యలు చేపడుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం