Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌‌కు పొంచి ఉన్న మరో ప్రమాదం.. మహిళల అక్రమ రవాణా..!

Webdunia
సోమవారం, 4 మే 2015 (13:50 IST)
వరుస భూకంపాలతో వణికిపోతున్న నేపాల్ ప్రజలకు మరో భయం పట్టుకుంది. అదే హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమరవాణా). అసలే హ్యూమాన్ ట్రాఫికింగ్‌కు నేపాల్ దేశం కేంద్రంగా తయారైంది. ఇప్పుడు ఈ దేశంలోని మహిళల అక్రమ రవాణా మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. 
 
ఈ విషయం గురించి అధికారి ఒకరు మాట్లాడుతూ.. నేపాల్‌లో మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, వారు ప్రయాణికుల వివరాలు, వీసా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని తెలిపారు. ముఖ్యంగా నేపాల్ నుంచి వస్తున్న పిల్లలు, మహిళా ప్రయాణీకుల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. 
 
అందులో భాగంగా నేపాల్ ‌నుంచి విదేశాలకు వెళుతున్న వైమానిక మార్గంతో పాటు రోడ్డు మార్గంపై కూడా ప్రత్యేకంగా కన్నేసినట్టు అక్కడి నుంచి వస్తున్న టాక్సీలను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే వెలుపలికి పంపుతున్నట్టు ఆయన వివరించారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments