Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషిని చంపిన మొసలి.. మంత్రశక్తితో వెనక్కి రప్పించిన మొనగాడు... (Video)

ప్రపంచంలో కొన్ని వింతలు విశేషాలు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని నమ్మశక్యంగానీ సంఘటనలు ఉంటాయి. అలాంటి నమ్మశక్యంగాని సంఘటన ఒకటి ఇండోనేషియాలోని జకార్తాలో వెలుగులోకి వచ్చింది. నదిలో స్నానం చేస్తున్న మనిషిని

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (09:11 IST)
ప్రపంచంలో కొన్ని వింతలు విశేషాలు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని నమ్మశక్యంగానీ సంఘటనలు ఉంటాయి. అలాంటి నమ్మశక్యంగాని సంఘటన ఒకటి ఇండోనేషియాలోని జకార్తాలో వెలుగులోకి వచ్చింది. నదిలో స్నానం చేస్తున్న మనిషిని చంపిన మొసలిని ఓ మంత్రగాడు తన మంత్రశక్తితో వెనక్కి రప్పించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నమ్మశక్యంగానీ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ఇండోనేసియాలోని జకార్త నగరంలో సయారిఫుద్ధీన్ అనే 41 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఓ నదిలో స్నానానికి వెళ్లాడు. వీరంతా కలిసి నదిలో స్నానం చేస్తుండగా, ఉన్నట్టుండి ఓ మొసలి వచ్చి సయారిఫుద్ధీన్‌ను నోటితో బలంగా కరచుకుని నదిలోకి ఈడ్చుకెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ మృతదేహం కోసం ఒక రోజంతా గాలించారు. అయినా ఫలితం చిక్కలేదు. 
 
దీంతో స్థానికంగా ఓ మొసళ్ల మంత్రగాడు నివశిస్తున్నాడు. అతన్ని మృతుని కుటుంబ సభ్యులు సంప్రదించి, నది వద్దకు తీసుకొచ్చారట. సయారిఫుద్ధీన్ మృతదేహాన్ని చంపిన మొసలే వెనక్కి తీసుకురావాలంటూ మంత్రగాడు మొసలికి క్షుద్రపూజలు చేశాడట. పూజా కార్యక్రమాలు ముగిసిన కొద్దిసేపటి తర్వాత ఆందరూ ఆశ్చర్యపోయేలా చంపిన మొసలే సయారిఫుద్ధీన్ మృతదేహాన్ని తీసుకొచ్చిందట. 
 
మృతదేహాన్ని నది ఒడ్డుకు తీసుకొచ్చి వదిలేసి వెళ్లిందట. ఆ మంత్రగాడు ఏం చదివాడో.. మొసలి ఎందుకు మృతదేహాన్ని వెనక్కి తీసుకొచ్చిందో తెలియదు. కానీ ఈ ఘటన ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, మరికొందరు మాత్రం ఓ మొసలి మనిషిని ఈడ్చుకెళ్లి, చంపిన అనంతరం అందరూ చూస్తుండగా తీసుకొచ్చి వదిలి వెళ్లడం నమ్మశక్యంగా లేదని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్  మీడిుయాలో వైరల్‌గా మారింది. 
 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments