Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్షుడికి రాజభోగాలు.. పదవి ఊడినా లాభాలెన్నో.. వేతనం ఎంతో తెలుసా? రూ.2 కోట్ల పైచిలుకే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిదో తేలిపోనుంది. అమెరికా అధ్యక్షుడికి మించిన రాజభోగాలు అంతా ఇంతా కాదు. శ్వేత సౌధ పీఠాధిపతికి వేతనమెంతో తెలుసుకుంటే షాక్ తినాల్సిందే. ఏకంగా 4,00,000 డాలర్లు. అంటే రూ.

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (14:27 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిదో తేలిపోనుంది. అమెరికా అధ్యక్షుడికి మించిన రాజభోగాలు అంతా ఇంతా కాదు. శ్వేత సౌధ పీఠాధిపతికి వేతనమెంతో తెలుసుకుంటే షాక్ తినాల్సిందే. ఏకంగా 4,00,000 డాలర్లు. అంటే రూ.2కోట్ల 66 లక్షల 84వేల 180లను వేతనంగా తీసుకుంటారట. వేతనంతో పాటు అదనంగా ప్రయాణాలకు, ఖర్చులకు మనీ చెల్లిస్తారట.  
 
ఇక శ్వేతసౌధం 132 గదులను కలిగివుంటుంది. ఈ గదులన్నీ పువ్వుల సువాసనలతో వెల్లివిరుస్తాయి. వెంచర్ వ్యయాలు మాత్రమే ఏడాదికి 2,50,000 డాలర్లుపైనేనని అంచనా. మొత్తానికి వైట్ హౌస్ వ్యయం ఏడాదికి 4 మిలియన్ డాలర్ల పైనేనట. అధ్యక్షుడి కోసం సూపర్ లగ్జరీ ఆఫీస్, కాన్ఫరెన్స్ రూమ్, జిమ్, బెడ్ రూమ్, బాత్ రూమ్  ఉంటాయట. ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. 
 
మొదటి ఫ్యామిలీ తినే ప్రైవేట్ మీల్స్, స్టేట్ డిన్నర్స్ అన్నింటికీ గార్డెన్‌లోని ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయలతోనే ఉపయోగిస్తారు. ఎగ్జిక్యూటివ్ అండ్ సోస్స్ చెఫ్‌లు మాత్రమే వీటిని వండుతారట. అదేవిధంగా శ్వేతసౌధం గ్రౌండ్‌లో తేనేటీగల నుంచి తీసిన తేనెనే వారు ఉపయోగిస్తారు. శ్వేత సౌధ అధ్యక్ష కుటుంబం కోసం ఏర్పాటుచేసిన ఏకాంతవాసం క్యాంప్ డేవిడ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. 
 
చెక్కతో నిర్మించబడిన ఈ ఇళ్లు, స్పా, స్విమింగ్ పూల్, బౌలింగ్ అల్లే, స్కీట్ షూటింగ్ రేంజ్, టెన్నిస్ కోర్టులు, గోల్ఫ్ కోర్సు, గుర్రం స్టేబుల్స్, ఐస్ స్కేటింగ్ రింక్ లు కలిగి కుటుంబంతో ఉల్లాసంగా, ఉత్సాహాంగా గడపడానికి దోహదం చేస్తుంది. అమెరికా అధ్యక్ష పదవినుంచి దిగిపోయాక కూడా 2,00,000 డాలర్ల వరకు ఏడాది పెన్షన్, ఉచిత ఆరోగ్య సదుపాయాలు వంటి ఎన్నో సదుపాయాలు వారి వెన్నంటి వుంటాయట. దీన్నిబట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడు తప్పకుండా రాజభోగాలే అనుభవిస్తారని చెప్పాలి. ఆ పదవి నుంచి తొలగిపోయినా.. సదుపాయాలకు ఢోకా ఉండదు. అలా బరాక్ ఒబామాకు కష్టాలు లుండవనే చెప్పాలి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments