Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య శవాన్ని మోస్తూ 10 కిమీ నడక దృశ్యం బహ్రెయిన్ ప్రధానినీ కదిలించింది!

ఇటీవల ఓడిషా రాష్ట్రంలో భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్ల మేరకు నడిచిన ఓ బాధితుడి కన్నీటి కథ బహ్రెయిన్ ప్రధానమంత్రిని సైతం కదిలించింది. తక్షణం బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిం

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (17:13 IST)
ఇటీవల ఓడిషా రాష్ట్రంలో భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్ల మేరకు నడిచిన ఓ బాధితుడి కన్నీటి కథ బహ్రెయిన్ ప్రధానమంత్రిని సైతం కదిలించింది. తక్షణం బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి.. ఆ బాధితుడి వివరాలను సేకరించారు. 
 
ఒడిశాకు చెందిన దనా మాఝీ భార్య శవాన్ని మోస్తూ పది కిలోమీటర్లు నడక సాగించిన ఘటన దేశాన్నే కాదు ప్రపంచం దృష్టినీ ఆకర్షించిన విషయం తెల్సిందే. ఈ విషాద ఘటనతో అనేక చలించి పోయారు. ఒడిషా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై తీవ్రమైన విమర్శలు చేశారు. 
 
అదేసమయంలో ఈ విషాద ఘటన బహ్రెయిన్ రాజకుటుంబీకులను కదిలించింది. భార్య శవాన్ని భుజాలపై మోసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి చలించిపోయిన బహ్రెయిన్ ప్రధాని, రాజ కుటుంబీకుడు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బాధితుడి కుటుంబ వివరాల కోసం ఆరా తీశారు. 
 
బహ్రెయిన్‌లోని భారత రాయబారి నుంచి సమాచారం కోరినట్టు బహ్రెయిన్ మీడియా వెల్లడించింది. అయితే మాఝీకి ఏ రకమైన సాయం చేయాలనుకుంటున్నారనే విషయాన్ని మాత్రం ప్రధాని కార్యాలయం వెల్లడించలేదు. వ్యక్తి గతంగా మాఝీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలనుకుంటున్నట్టు సమాచారం. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments