Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరి మసూద్‌ని అప్పజెప్పొచ్చుగా... సుష్మా ప్రశ్న

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:33 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, ఆ దేశ ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాక్‌ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోనంతవరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమని  స్పష్టం చేసిన సుష్మా... పాక్‌ ప్రధాని నిజంగా గొప్ప ఔదార్యం కలిగిన వారే అయితే మసూద్‌ అజార్‌ను భారత్‌కు అప్పగించాలని కోరారు.
 
ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న సుష్మాస్వరాజ్‌‌ను... భారత్‌ జరిపిన వైమానిక దాడుల గురించి ప్రశ్నించగా, ఆవిడ సమాధానమిస్తూ...‘జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ దాడులు జరిపింది. కానీ పాక్‌ మిలిటరీ మాత్రం జైషే తరఫున మన దేశంపై దాడికి యత్నించింది. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్ర సంస్థలకు ఆర్థికంగా సాయం చేస్తోందన్నారు. 
 
తీవ్రవాద రహిత వాతావరణం మధ్యే మేం పాక్‌తో చర్చలు జరుపుతాము. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకెళ్లవు’ అంటూ దాయాది దేశంపై తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ రాజనీతిజ్ఞుడు అని కొంతమంది చెబుతున్నారనీ, ఆయనకు అంత శక్తే ఉంటే జైషే అధినేత మసూద్‌ను భారత్‌కు అప్పగించాలని సుష్మా అన్నారు. అప్పుడే ఆయన ఔదార్యం ఎంత గొప్పదో తెలుస్తుందని ఎద్దేవా చేసారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments