Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ కోసం పవిత్ర యుద్ధం చేస్తున్నాం : హఫీజ్ సయీద్

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2015 (17:13 IST)
కాశ్మీర్ కోసం పవిత్ర యుద్ధం చేస్తున్నట్టు జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అంటున్నారు. ముఖ్యంగా.. కాశ్మీర్ వేర్పాటువాద నేత మసారత్ ఆలం అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. కాశ్మీరీల కోసం ఆలం ఎంతో చేస్తున్నాడంటూ కితాబిచ్చాడు. 
 
ముంబై దాడుల కేసుల్లో పాకిస్థాన్ సరైన సాక్ష్యాధారాలను సమర్పించక పోవడంతో ఆయనను విడుదల చేయాల్సిందిగా లాహోర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన జైలు నుంచి విడుదలై రహస్య స్థావరంలో ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన ఓ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న జీహాదీ పోరాటానికి తాను పూర్తి మద్దతు పలుకుతానని ప్రకటించారు. కాశ్మీరీ ముస్లింలకు అండగా ఉంటున్న పాక్ సైన్యానికి, ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. 
 
కాశ్మీర్ కోసం చేసే పోరాటాన్ని 'పవిత్రయుద్ధం'గానే పరిగణిస్తామని తెలిపాడు. వేర్పాటువాద నేత మసారత్ ఆలం అరెస్టుపై స్పందిస్తూ, ఆయన ముస్లిం సమాజం కోసం ఎంతో చేస్తున్నాడని కొనియాడాడు. శ్రీనగర్‌లో జరిగిన ఒక ర్యాలీలో పాకిస్థాన్ జెండాలను ఎగురవేసిన కేసులో ఆలంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments