Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై దాడికి చైనా సన్నాహాలు? టిబెట్‌కు చేరువలో చైనా బాంబర్లు

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (09:02 IST)
భారత్‌పై దాడి చేసేందుకు డ్రాగన్ కంట్రీ సన్నాహాలు చేస్తుందా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. భారత్‌కు చేరువలో టిబెట్‌ భూభాగంలో తన సైనిక సత్తాను చైనా క్రమంగా పెంచడమే దీనికి నిదర్శనమని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, టిబెట్‌కు సమీపంలో చైనా బాంబర్ విమానాలను మొహరించడం ఇపుడు ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తలు పెంచేలా ఉన్నాయి. 
 
తాజాగా హెచ్‌-6 అనే అధునాతన బాంబర్‌ విమానాలను మోహరించింది. హాపింగ్‌ వైమానిక క్షేత్రంలో వీటిని రంగంలోకి దించింది. ఇది భారత్‌లోని సిక్కిం సరిహద్దుకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పౌర, సైనిక విమానాల కార్యకలాపాలకు పనికొచ్చే ఈ స్థావరాన్ని చైనా సైన్యం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. 155 ఎంఎం శతఘ్నులనూ అక్కడ మోహరించినట్లు సమాచారం.
 
సోవియట్‌ హయాం నాటి టుమోలెవ్‌ టీయూ-16 బాంబర్‌ ఆధారంగా హెచ్‌-6ను చైనా రూపొందించింది. ఇది దీర్ఘశ్రేణి దాడులకు పనికొస్తుంది. దీన్ని వ్యూహాత్మక బాంబర్‌గా కూడా పేర్కొంటున్నారు. అణ్వస్త్ర సామర్థ్యమున్న అమెరికా విమానవాహక నౌకలపై దాడి చేయగల సత్తా దీనికి ఉందని భావిస్తున్నారు. ఇలాంటి ఆయుధాన్ని తన పొరుగున మోహరించడంపై భారత్‌ దృష్టి సారించింది. ఒకవేళ యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ బాంబర్‌ ఎలాంటి పాత్ర పోషించనుంది వంటి అంశాలపై భారత భద్రతా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments