దోపిడీని అడ్డుకున్న భారత సంతతి మహిళ కాల్చివేత... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (12:56 IST)
అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ మరింతగా హెచ్చుమీరితోపోతోంది. తాజాగా ఓ దుండగుడు చేతిలో భారత సంతతి మహిళ హత్యకు గురైంది. సాయుధ దోపిడీని అడ్డుకోవడమే ఆ మహిళ చేసిన తప్పు.. దీంతో ఆ మహిళను ఓ దండగుడు వెంబడించి మరీ కిరాతకంగా కాల్చి చంపేశాడు. మృతురాలిని గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ (49)గా గుర్తించారు. యూనియన్ కౌంటీలోని పిక్నీ స్ట్రీట్‌లో మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కిరణ్ పటేల్ స్థానికంగా 'డీడీస్ ఫుడ్ మార్ట్' పేరుతో ఒక కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్నారు. మంగళవారం ముసుగు ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో స్టోరులోకి ప్రవేశించాడు. దోపిడీ చేసే ఉద్దేశంతో వచ్చిన అతడిని చూసి కిరణ్ పటేల్ భయపడలేదు. వెంటనే అతడిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. తన చేతికి అందిన ఒక వస్తువును దుండగుడిపైకి విసిరి, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
 
దీంతో ఆగ్రహానికి గురైన దుండగుడు ఆమెపై కాల్పులకు తెగ బడ్డాడు. క్యాష్ కౌంటరుపైకి దూకి మరీ ఆమెపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ప్రాణభయంతో కిరణ్ పటేల్ స్టోర్ బయట ఉన్న పార్కింగ్ వైపు పరుగులు తీశారు. అయినా ఆ దుండగుడు ఆమెను వదలకుండా వెంబడించి, మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆమె స్టోర్ ప్రవేశ ద్వారానికి కొద్ది దూరంలోనే రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు.
 
సమాచారం అందుకున్న వెంటనే యూనియన్ ప్రజా భద్రతా విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. ఈ ఘటన మొత్తం స్టోరులోని సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించి అరెస్టు చేశారు. ఉపాధి కోసం వెళ్లిన భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురికావడంతో స్థానిక ప్రవాస భారతీయుల్లో కలకలం రేపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి- 4K డాల్బీ అట్మాస్‌తో శివ రీ రిలీజ్.. నాగార్జున ప్రకటన

Dude: ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా ఫిల్మ్ డ్యూడ్ నుంచి బాగుండు పో రిలీజ్

Itlu Mee Edava : ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్ విడుదల.. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలు.. రెండు వారాల పాటు విశ్రాంతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments