Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షట్ డౌన్: హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములను..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు కష్టాల్లో పడింది. నిర్ణీత కాల వ్యవధిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. ద్రవ్యవినిమయ బిల్లు పాస్‌ కావడానికి మొత్తం 60 ఓట్

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (17:01 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు కష్టాల్లో పడింది. నిర్ణీత కాల వ్యవధిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. ద్రవ్యవినిమయ బిల్లు పాస్‌ కావడానికి మొత్తం 60 ఓట్లు అవసరం ఉండగా 48 ఓట్లు వ్యతిరేకంగా పడటంతో బిల్టు ఆమోదానికి నోచుకోలేదు. ఈ బిల్లుకు కొందరు రిపబ్లికన్లు కూడా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. 
 
శుక్రవారం రాత్రితో ద్రవ్యవినిమయ బిల్లు గడువు ముగిసింది. కానీ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి మరో 9 మంది డెమోక్రాట్ల మద్దతు లభించకపోవడంతో ప్రభుత్వ చర్యలు ఆగిపోయాయి. ప్రభుత్వం షట్ డౌన్ కావడంతో రూ.42వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ దేశ మీడియా ద్వారా తెలిసింది. దీంతో అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వకార్యక్రమాలు నిలిచి పోనున్నాయి.
 
ప్రభుత్వం కార్యాలయాలు మూతపడటంతో 40 రోజుల పాటు 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతం లేని సెలవులు ప్రకటిస్తారు. ఈ ప్రభావం పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం నుంచి నిధులు ఆగిపోవటంలో ప్రజలు తమ పొదుపు సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 
మరోవైపు హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములను హెచ్‌-4 వీసా కింద ఉద్యోగాలు చేసేందుకు అనుమతించాలని అమెరికా ప్రభుత్వానికి ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌తో పాటు పలు ఐటీ దిగ్గజ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఐటీ పరిశ్రమ మండలి, అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బీఎస్‌ఏ (ది సాప్ట్‌‌వేర్‌ అలయెన్స్‌) తదితర సంఘాలు అమెరికా సిటీజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ లీ ఫ్రాన్సిస్‌ సిస్నాకు లేఖ రాశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments