Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృతసర్ గోల్డెన్ టెంపుల్ స్ఫూర్తితో అమెరికాలో అన్నదానాలు!

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (17:59 IST)
అమృతసర్ స్వర్ణదేవాలయం స్ఫూర్తితో అమెరికాలో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అమృతసర్లోని స్వర్ణదేవాలయంలో నిర్వహించే 'లంగర్'తో స్ఫూర్తిపొంది.. అమెరికాలోని కొంతమంది విద్యార్థులు ఆన్ ఆర్బర్ ప్రాంతంలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. 
 
వీళ్లంతా గత వేసవి కాలంలో స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రతిరోజూ 60వేల మందికి కొంతమంది వాలంటీర్లు భోజనాలు పెడతారు. షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసుకుని మరీ ఇలా అంతా కలిసి ఈ విధులు నిర్వర్తిస్తారు. దీన్ని చూసి అబ్బురపడిన విద్యార్థులు తమ యూనివర్సిటీలో కూడా ఈ తరహాలోనే అన్నదానం చేయడం మొదలుపెట్టారు.
 
ప్రతి శుక్రవారం వాళ్లు పదివేల మందికి ముందుగా తయారుచేసిన ఆహారాన్ని ప్యాక్ చేసి ఇస్తున్నారు. అలా తయారుచేసినవాటిలో ఏమైనా మిగిలిపోతే అనాథాశ్రమాలకు పంపుతున్నారు. అమెరికాలో ధనవంతులతో పాటు చాలామంది పేదలు కూడా ఉన్నారని, అందువల్ల అందరూ ఇలా ముందుకు రావాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. 
 
యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఈ 'లంగర్' అందరికీ స్ఫూర్తినిస్తుందని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ జస్ప్రీత్సింగ్ తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments