Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాములా కుబుసం విడుస్తున్న చిన్నారి.. మీరూ చూడండి (Video)

సాధారణంగా పాములు కుబుసం (చర్మాన్ని) విడుస్తుంటాయి. కానీ, అమెరికాకు చెందిన ఆరేళ్ళ చిన్నారి పాములా ప్రతి పక్షం రోజులకు ఒకసారి చర్మాన్ని కుబుసంలా విడుస్తోంది. ఇది వైద్యులకే ఓ సవాల్‌గా మారింది. ఈ వివరాలను

Webdunia
ఆదివారం, 11 జూన్ 2017 (11:29 IST)
సాధారణంగా పాములు కుబుసం (చర్మాన్ని) విడుస్తుంటాయి. కానీ, అమెరికాకు చెందిన ఆరేళ్ళ చిన్నారి పాములా ప్రతి పక్షం రోజులకు ఒకసారి చర్మాన్ని కుబుసంలా విడుస్తోంది. ఇది వైద్యులకే ఓ సవాల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అమెరికాలోని ఉల్టెవాకు చెందిన ఆరేళ్ళ చిన్నారి లామెల్లర్ ఇచ్‌థైయోసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. దీంతో పాము కుబుసం విడిచినట్టు ఈ చిన్నారి చర్మం రోజూ రాలిపోతోంది. ఆ వెంటనే కొత్త చర్మం పుట్టుకొస్తోంది. కొత్త చర్మ కణాలు అత్యంత వేగంగా పుట్టుకు రావడం వైద్యులను విస్మయ పరుస్తోంది. 
 
పైగా, చిన్నారి చర్మ గ్రంథులు మూసుకుపోవడంతో ఆమెకు చెమట పట్టడం లేదు. ఇది మరింత ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండడంతో ఆమె తల్లిదండ్రులు మేగాన్, టైసన్‌లు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. నిరంతరం కుమార్తె శరీరానికి లోషన్లు రాస్తూ పొడిబారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ చిన్నారి చర్మం పొడిబారితే  అది పగిలిపోయి రక్త స్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments