Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మా చట్ట పరిధిలోకి రాదే.. అయినా చేస్తామంటున్న మా మంచి మామయ్యలు

మామూలుగా మనం ఏదయినా వస్తువులు కోల్పోయో, సహాయం అవసరమయ్యో పొరపాటున పోలీసులను సహాయం చేయమన అడిగామనుకోండి. మనకు ఏ రెకమెండేషన్ లేకపోతో వెంటనే వారినుంచి వచ్చే సమాధానం ఇది అది మా జ్యురిస్‌డిక్షన్‌లోకి రాదు. వేరే స్టేషన్లో అడగండి.

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (03:07 IST)
మామూలుగా మనం ఏదయినా వస్తువులు కోల్పోయో, సహాయం అవసరమయ్యో పొరపాటున పోలీసులను సహాయం చేయమన అడిగామనుకోండి. మనకు ఏ రెకమెండేషన్ లేకపోతో వెంటనే వారినుంచి వచ్చే సమాధానం ఇది అది మా జ్యురిస్‌డిక్షన్‌లోకి రాదు. వేరే స్టేషన్లో అడగండి. నూటికి 99 మంది అనామకులు, రాజకీయంగా పలుకుబడి లేనివారు పోలీసుల నుంచి ఇదే సమాధానం పొందుతారు. కానీ అమెరికాలో పోలీసులు తమకు సంబంధం లేకపోయినా ఒక బాలికకు అరుదైన సహాయం చేశారు. సహాయం అంటే మరేమీ కాదు. లెక్కల్లో చిక్కుముడి విప్పడం.  వివరాల్లోకి వెళితే.. 
 
లీనా డ్రేపర్‌ హోమ్‌ వర్క్‌ చేసుకుంటోంది. ఆ చిన్నారి వయసు 10 ఏళ్లు. మ్యాథ్స్‌లో ఆమెకో డౌట్‌ వచ్చింది. మేథ్స్‌ ఎలా ఉంటుందో తెలుసు కదా! మనసు లేని సబ్జెక్ట్‌. పాషాణ హృదయురాలు. చిన్న పిల్లా, పెద్ద పిల్లా అని చూసుకోదు. ఆన్సర్‌ కావాలంతే! ఏదో ఒకలా చెప్పేస్తే ఊరుకోదు. లాజిక్‌  కావాలి.
 
లీనాకు వచ్చిన కష్టం ఏంటంటే (8+29) ×15 = ఎంత అన్నది. అమ్మని అడిగితే ‘సొంతంగా చెయ్‌’ అంది. నాన్నని అడిగితే ‘ఐ యామ్‌ బిజీ’ అన్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు లీనాకు. వెంటనే నెట్‌లోకి వెళ్లి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌ ఓపెన్‌ చేసింది. తన సమస్యను అందులో పోస్ట్‌ చేసింది. తర్వాత ఏం జరిగి ఉంటుంది
 
పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి సమాధానం వచ్చేసింది! ‘ఫస్ట్‌.. బ్రాకెట్‌లో ఉన్న వాటిని కలుపు. కలపగా వచ్చిన మొత్తాన్ని 15తో గుణించు’ అని మెసేజ్‌ ఇచ్చారు ఓహియో స్టేట్‌ పోలీసులు. లీనా డ్రేపర్‌ ఆనందానికి హద్దుల్లేవు.
 
‘అది మా జ్యురిస్‌డిక్షన్‌లోకి రాదు’ అని తరచు మన పోలీసులు అంటుంటారు. అలాగైతే లీనా డ్రేపర్‌ అడిగిన హెల్ప్‌ అమెరికాలోని 50 రాష్ట్రాల పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ల పరిధిలోకి రాదు. అయినా లీనాకు సమాధానం వచ్చింది. 
అియినా మనలోమాట. సహాయం చేసే ఉత్సాహం ఉంటే పరిథులు, పరిమితులు అడ్డొస్తాయా!
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments