Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య చరిత్రలోనే పాకిస్థాన్ అమ్మాయిది అరుదైన కేసు.. వంద ఆపరేషన్లు చేయించుకున్నా...

అనారోగ్య సమస్య వస్తే శరీరానికి ఆపరేషన్ అంటే ఒకటో రెండో చేసుకుంటారు...కానీ ఓ పాకిస్థాన్ అమ్మాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మాత్రం వంద స‌ర్జ‌రీలు చేయించుకుంది. అరుదైన చ‌ర్మ వ్యాధితో బాధ‌ప‌డుతున్న 25 ఏళ్

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (11:29 IST)
అనారోగ్య సమస్య వస్తే శరీరానికి ఆపరేషన్ అంటే ఒకటో రెండో చేసుకుంటారు...కానీ ఓ పాకిస్థాన్ అమ్మాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మాత్రం వంద స‌ర్జ‌రీలు చేయించుకుంది. అరుదైన చ‌ర్మ వ్యాధితో బాధ‌ప‌డుతున్న 25 ఏళ్ల ఫౌజియాకు ఆదివారం వందో స‌ర్జ‌రీ నిర్వ‌హించారు లాహోర్‌లోని షేక్ జాయెద్ హాస్పిట‌ల్ వైద్యులు. చిన్న వ‌య‌సు నుంచే ఫైబ్రోమ‌టోసెస్ అనే అరుదైన చ‌ర్మ వ్యాధితో బాధ‌ప‌డుతోంది ఫౌజియా. 8 ఏళ్ల వ‌య‌సులో ఆమె ఎడ‌మ చేయికి ఈ వ్యాధి సోకింది. ఆ చేయిని తీసేయాల‌ని, లేదంటే అది శ‌రీర‌మంతా పాకి ప్రాణాల‌కు ముప్ప‌ని డాక్ట‌ర్లు వార్నింగిచ్చినా.. ఫౌజియా మాత్రం అందుకు నిరాకరించింది. 
 
వ్యాధిని నయం చేయడానికి వైద్యులు ఎంతగానో పాటుపడ్డారు. కానీ ఫలితం దక్కలేదు. చివరకు వ్యాధికి కారణమైన ఎడమ మోచేతిని తొలగించాలని నిర్ణయించారు. ఎన్ని స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డానికైనా సిద్ధ‌మే కానీ.. నా చేయి తీయించేసుకొని విక‌లాంగురాలిగా జీవించ‌డానికి మాత్రం ఇష్ట‌ప‌డ‌ను అని ఫౌజియా స్పష్టం చేసింది. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన ఫౌజియా.. ఈ అరుదైన చర్మ వ్యాధి చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చును భ‌రించ‌డం చాలా కష్టంగా ఉంటోంద‌ని వాపోయింది. నెల‌కు మందుల‌కే దాదాపు రూ.15 వేలు ఖ‌ర్చ‌వుతోందని చెప్పింది. 
 
వైద్య చ‌రిత్ర‌లోనే ఫౌజియాది చాలా అరుదైన కేస‌ని ఆమెకు 55 స‌ర్జరీలు నిర్వ‌హించిన వైద్యుడు ష‌ఫిక్ అహ్మ‌ద్ తెలిపారు. అయితే వంద స‌ర్జ‌రీలు అయిన త‌ర్వాత ఇప్పుడు వైద్యులకు కూడా ఆమెకు చికిత్స చేయ‌డం స‌వాలుగా మారింది. స‌ర్జరీ కోసం ఆమె కాలి భాగం నుంచి చ‌ర్మాన్నితీయడానికి ప్రయత్నించగా....ఆ భాగానికి కూడా ఇప్పుడు ఈ వ్యాధి సోక‌డంతో శ‌రీరంలో కొత్త చ‌ర్మం దొర‌క‌డం లేద‌ని వైద్యులు తెలిపారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments