స్మార్ట్ ఫోన్స్‌తో కాలం గడుపుతూ.. హెడ్ ఫోన్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే... హెడ్ ఫోన్స్ వాడేవారిని వణికించే దుర్ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఫోన్‌ఛార్జింగ్‌లో వుండగానే.. హెడ్ ఫోన్ ద్వారా ఫోన్ మాట్లాడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే.. లూయిసా పిన్హిరో (17) అనే యువతి.. హై వోల్టేజ్ విద్యుత్ కారణంగా హెడ్ ఫోన్స్ పేలిపోవడంతో మరణించింది. ఫోన్ ఛార్జ్‌లో పెట్టింది. అంతటితో ఆగకుండా ఫోన్‌లో హెడ్ ఫోన్ ద్వారా మాట్లాడింది. చివరికి ఎలక్ట్రిక్ షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరింది.
లూయిసాను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయిది. అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యుదాఘాతానికి హెడ్ ఫోన్స్ చెవుల్లోనే కరిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఫోన్ ఛార్జింగ్‌లో వున్నప్పుడు వాటిని వాడకుండా వుండాలని హెచ్చరించినా.. వాటిని వినియోగదారులు పట్టించుకోవట్లేదని.. తద్వారా ఇలాంటి అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు చెప్తున్నారు.