Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెమిడీసివిర్ ట్రయల్స్ ప్రారంభం.. కానీ వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్ఓ ఏమందంటే?

Webdunia
మంగళవారం, 5 మే 2020 (17:36 IST)
గిలీడ్ ఫార్మా సంస్థ ఇటీవలే రెమిడీసివిర్ అనే మెడిసిన్‌ను కరోనా రోగులపై ప్రయోగించింది. కానీ ఫస్ట్ ట్రయల్‌లో ఈ మెడిసిన్ ఫెయిల్ అయింది. తాజాగా కొంత మేర అది మంచి ఫలితాలను సాధించినట్టు తెలుస్తోంది. 
 
ఇటీవల కరోనా రోగులకు ఈ మెడిసిన్‌ను వాడవచ్చని అమెరికా ఆమోదం కూడా తెలిపింది. తొలి విడతగా 1.5 మిలియన్ డ్రగ్ డోస్‌ను తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్ పరిశోధనలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములు అయ్యారు.
 
తాజాగా భారత్‌లో కూడా రెమిడీసివిర్ మెడిసిన్‌ను ట్రయల్స్ గా వినియోగించనున్నారు. దీని కోసం 1000 డోసులు సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని కరోనా రోగులకు ఇవ్వబోతున్నారు. ఈ ట్రయల్స్ ఫలితాలను ఇస్తే.. భారత్‌లో కూడా వీటిని కమర్షియల్‌గా తయారు చేసే అవకాశం ఉంది.
 
అయితే డబ్ల్యూహెచ్ఓ కొవిడ్-19 ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబర్రో మాత్రం కరోనా వ్యాక్సిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చునని తెలిపారు. చాలారకాల వైరస్‌లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదని, కరోనా విషయంలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. 
 
కరోనా వైరస్‌ను నిలువరించే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు దాదాపు లేవని నబర్రో స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రయోగాల కారణంగా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నా, చప్పున చల్లారిపోతున్నాయని, అంతిమంగా అన్నీ ఈ వైరస్ ముందు దిగదుడుపేనని డాక్టర్ నబర్రో చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments