Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకావులో తొలిసారిగా పాండాకు కవలలు పుట్టాయోచ్: 1864 పాండాలు మాత్రమే..?!

మకావులో పాండాకు తొలిసారిగా కవలపిల్లలు పుట్టడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ న్యూస్‌గా మారింది. మకావులో ఆదివారం జిన్ జిన్ అనే పాండాకు తన పెవిలియన్‌లో రెండు మగ పాండాలు జన్మించాయి. ఈ కవలల్లో ఓ పిల్ల ఆ

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (15:15 IST)
మకావులో పాండాకు తొలిసారిగా కవలపిల్లలు పుట్టడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ న్యూస్‌గా మారింది. మకావులో ఆదివారం జిన్ జిన్ అనే పాండాకు తన పెవిలియన్‌లో రెండు మగ పాండాలు జన్మించాయి. ఈ కవలల్లో ఓ పిల్ల ఆరోగ్యంగా ఉంటే.. మరోపిల్ల మాత్రం బరువు కాస్త తగ్గడంతో ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. 
 
పాండాల జాతి అవతరించిపోతున్న నేపథ్యంలో వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వరల్డ్‌వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ నిర్వహించిన 2014 సర్వేలో 1864 పాండాలు మాత్రమే అడవుల్లో నివసిస్తుండగా, మరో 300 జంతు ప్రదర్శన శాలల్లో ఉన్నాయి. జూలో నివసించే పాండాల్లో గర్భధారణ సహజంగా జరగకపోవడంతో కృత్రిమ గర్భధారణ పద్దతుల ద్వారా పాండాల సంతతిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. 
 
ఈ తరుణంలో ఇటీవలే బెల్జియం జూలో ఒక జెయింట్ పాండా కూడా మగ పాండాకు జన్మనిచ్చింది. తాజాగా మకావులో మరో పాండా తొలిసారిగా కవలలకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది. జిన్‌జిన్‌, కై కై అనే పాండాల జంటను చైనా మెయిన్‌లాండ్‌ మకావుకి బహుమతిగా ఇచ్చింది. గత ఏడాదే మకావుకు వచ్చిన పాండా జంటకు ప్రస్తుతం కవలలు జన్మించాయి.
 
జూన్ 14 నుంచే పాండా ప్రసవం కోసం పెవిలియన్‌ను మూసివేశారు. పుట్టిన కవలల్లో ఒకటి 138 గ్రాములుండగా, రెండో పిల్ల 53.8 గ్రాములే ఉంది. అందుకే బరువు తక్కువున్న పిల్లను ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments