Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలో ఆగని మారణ కాండ: 100 పాలస్తీనియన్ల హతం!

Webdunia
గురువారం, 31 జులై 2014 (13:11 IST)
గాజాలో హింస ఆగట్లేదు. గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరులో బుధవారం దాదాపు 100 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న ఓ స్కూలులో తలదాచుకున్న 20 మంది కూడా ఉన్నారు. అయితే తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి వీలుగా నాలుగు గంటలపాటు తాత్కాలికంగా దాడులకు విరామం ప్రకటించడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. 
 
మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ గాజాపై భారీఎత్తున గగనతల దాడులతో పాటుగా భూతల, సముద్ర దాడులను కొనసాగించడంతో కనీసం 68మంది పాలస్తీనియన్లు చనిపోగా, మరో 110మంది గాయపడినట్టు గాజా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఈనెల 8న ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు ప్రారంభమైనప్పటి నుంచి గత 23 రోజుల్లో గాజాలో మొత్తం 1283మంది చనిపోగా, 7100 మందికి పైగా గాయపడ్డారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments