బురఖాలను ధరించడంపై యూరోపియన్ యూనియన్ సంచలన తీర్పు.. నిషేధం విధించవచ్చు..
దేశంలో తలాఖ్ పద్ధతిపై ముస్లిం మహిళలు పోరాడుతుంటే యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. బురఖాలను తొలగించేందుకు నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురికావడంతో
దేశంలో తలాఖ్ పద్ధతిపై ముస్లిం మహిళలు పోరాడుతుంటే యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. బురఖాలను తొలగించేందుకు నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురికావడంతో ఫ్రాన్స్, బెల్జియంకు చెందిన ఇద్దరు మహిళలు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులపై విచారణ జరిపిన కోర్టు.. కంపెనీలు, యజమానులు తమ వద్ద పని చేసే సిబ్బంది మతపరమైన చిహ్నాలను ధరించడంపై నిషేధం విధించవచ్చునని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు బురఖాలను ధరించడంపై తొలి తీర్పు రావడం కూడా ఇదే తొలి కావడం గమనార్హం. అంతేగాకుండా.. సిద్ధాంత, రాజకీయ, మతపరమైన చిహ్నాన్ని బహిరంగంగా కనిపించేవిధంగా ధరించడాన్ని నిషేధించే అంతర్గత నిబంధన ప్రత్యక్ష వివక్ష కాదని కోర్టు పేర్కొంది.