Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకును విడాకులు కోరిందనీ.. కోడలినీ కాల్చి చంపిన అత్త!

అమెరికాలోని జార్జియాలో దారుణం జరిగింది. గొడవల కారణంగా భర్తలే తమ భార్యలను హతమారుస్తున్నవార్తలు రోజూ వింటూనే ఉన్నాం.. అలాంటిది ఓ అత్త తన కోడలిని తుపాకీతో దారుణంగా కాల్చిచంపేసింది. 63 ఏళ్ళ ఎలిజబెత్ వాల్

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (12:08 IST)
అమెరికాలోని జార్జియాలో దారుణం జరిగింది. గొడవల కారణంగా భర్తలే తమ భార్యలను హతమారుస్తున్నవార్తలు రోజూ వింటూనే ఉన్నాం.. అలాంటిది ఓ అత్త తన కోడలిని తుపాకీతో దారుణంగా కాల్చిచంపేసింది. 63 ఏళ్ళ ఎలిజబెత్ వాల్ అనే మహిళ కోడలు.. కొడుకుతో గొడవపడి కొద్ది రోజులుగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఒకరోజు ఎలిజబెత్.. కోడలి ఇంటికి వెళ్ళింది. మొదట ఏమి తెలీనట్టు ఇద్దరు మనవళ్ళను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి వాహనంలో కూర్చోబెట్టింది. తిరిగి ఇంట్లోకి వెళ్ళి కోడలైన 35 ఏళ్ళ జెన్నాను తుపాకీతో కాల్చి చంపింది. 
 
వెంటనే ఆఫీసులో ఉన్న కుమారుడు జర్రాడ్‌కు ఫోన్ చేసింది. వెంటనే వచ్చి పిలల్ని తీసుకెళ్ళాలని చెప్పి ఫోన్ పెట్టేసింది. జర్రాడ్‌ అసలు ఏం జరిగిందో తెలీక కంగారు కంగారుగా ఇంటికి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ పెద్ద కుమారుడికి ఫోన్ చేయగా ఇంట్లో కాల్పుల శబ్ధం వినిపించినట్లు చెప్పాడు. దీంతో వెంటనే ఇంటికి వచ్చిన జర్రాడ్ షాక్ తిన్నాడు. 
 
రక్తపు మడుగుల్లో ఉన్న భార్య, తుపాకీతో ఉన్న తల్లిని చూసి తలబద్దలు కొట్టుకున్నాడు. అసలు విషయం తెలుసుకున్న జర్రాడ్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.  పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేశారు. కొడుకుతో విడాకులకు ప్రయత్నిస్తున్నందునే కోడలు జెన్నాను ఆమె హత్యచేసి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments