Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ వేడుకల్లో విషాదం : కొబ్బరి వైన్ తాగి 11 మంది మృతి

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (12:41 IST)
ఫిలిప్పీన్స్‌ జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం జరిగింది. కొబ్బరి వైన్ తాగి 11 మంది చనిపోగా, మరో 300 మందికిపై అస్వస్థతకు లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిలిప్పీన్స్ దేశంలోని దక్షిణ మనీలాలో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అన్ని రకాల మద్యాన్ని పంపిణీ చేశారు. ఇలాంచి వాటిలో కొబ్బరి వైన్ కూడా ఒకటి. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో కొందరు కొబ్బరి వైన్ తాగారు. అలా తాగినవారిలో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నగర మేయర్ ఆదేశానుసారం వీరిలో చాలా మందికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. గత గురువారం నుంచి నిన్నటి వరకు ఈ మరణాలు సంభవించాయని మేయర్ తెలిపారు.
 
వాస్తవానికి ఈ వైన్‌కు ఫిలిప్పీన్స్‌లో మంచి ఆదరణ ఉంది. అందువల్లే ప్రతి ఫంక్షన్‌లో ఈ వైన్‌ను తప్పకుండా పంపిణీ చేస్తుండటంతో మద్యంబాబులు కూడా విరివిగా స్వీకరిస్తుంటారు. అయితే, మిథనాల్ వంటి వాటిని ఈ వైన్‌కు కలుపుతుండటంతో... ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. గత ఏడాది కూడా ఈ వైన్ వల్ల అక్కడ 21 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments