Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాబిన్‌హుడ్‌కి అమెరికన్ జస్టిస్ ఏంటో చూపిస్తామన్న అమెరికా

మెక్సికోలో పట్టుబడి శుక్రవారం అమెరికాకు తీసుకువచ్చిన అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా రారాజు జాక్విన్ ఎల్ గుజ్‌మెన్ రాబిన్ హుడ్ ఏమాత్రం కాదని, అతడికి ఇక అమెరికా న్యాయం ఎలా ఉంటుందో చూపిస్తామని అమెరికన్ న్యాయవాదులు చెబుతున్నారు.

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (02:58 IST)
మెక్సికోలో పట్టుబడి శుక్రవారం అమెరికాకు తీసుకువచ్చిన అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా రారాజు జాక్విన్ ఎల్ గుజ్‌మెన్ రాబిన్ హుడ్ ఏమాత్రం కాదని, అతడికి ఇక అమెరికా న్యాయం ఎలా ఉంటుందో చూపిస్తామని అమెరికన్ న్యాయవాదులు చెబుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా అమెరికా వీధుల్లో 200 టన్నుల పైగా మాదకద్రవ్యాలను కుమ్మరించి సామాజిక జీవితాన్ని కల్లోలపరిచిన డ్రగ్ మాఫియా కింగ్‌ ఇక జీవితాంతం అమెరికన్ జైల్లో కాలం గడపాల్సిందేనని, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా అతగాడు సంపాదించిన 14 బిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా స్వాధీనపర్చుకుంటుందని యుఎస్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. కార్టెల్ మాఫియా కింగ్ గుజ్‌మెన్‌ని గురువారం మెక్సికో నుంచి అమెరికాకు తరలించారు.
 
డ్రగ్ మాఫియా రారాజు గుజ్‌మెన్ కథ ముగిసిపోయందని, జీవితమంతా తాను సాగించిన నేరపూరిత, హింసాత్మక, మారణహోమానికి, విధ్వంస క్రీడకు అతగాడు అమెరికా కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సిందేనని న్యూయార్క్ అటార్నీ రాబర్ట్ కేపర్స్ చెప్పారు. ప్రపంచం నమ్ముతున్నట్లు గుజ్‌మెన్ మంచి పనులు చేసేవాడు, రాబిన్ హుడ్ ఏమాత్రం కాదని మానవ సమాజం మొత్తానికి కేన్సర్ కణం లాంటివాడని అటార్నీ పేర్కొన్నారు. 
 
దుర్బేద్యమైన మెక్సికో జైలు నుంచి రెండుసార్లు సంచలనాత్మకంగా తప్పించుకుని మళ్లీ పట్టుబడిన గుజ్‌మెన్ అమరికాకు తరలించబడే వరకు డ్రగ్ మాఫియాను శాసించిన రారాజుగా జీవించాడు. తన మాదక ద్రవ్యాల సరఫరా యంత్రాంగాన్ని కాపాడుకునేందుకు అతడు సాగించిన హత్యలకు అంతే లేదు. నిరంతరం మిలటరీ స్థాయి ఆయుధాలను వెంటబెట్టుకునేవాడు. వ్యక్తిగతంగా బంగారు పూత పూసిన ఏకే 47, వజ్రాలు పొదిగిన హ్యాండ్ గన్‌ నిత్యం అతనివద్ద ఉండేవట.
 
మెక్సికో నుంచి విమానం ద్వారా అమెరికన్ భూభాగంపై కాలుమోపగానే గుజ్‌మెన్ ఎదుర్కొనాల్సిన అమెరికన్ న్యాయం ఆచరణ రూపం దాల్చిందని స్పెషల్ ఏెజంట్ ఏంజెల్ మెలెండెజ్ పేర్కొన్నారు. అమెరికాలో విమానం దిగగానే ఆధునిక చరిత్రలో అత్యంత క్రూర నేరస్తుడి కళ్లలో ఆశ్చర్యం, దిగ్బ్రాంతి, భయం కనిపించాయని, దశాబ్దాల నేరచరిత్ర ముగిసిందన్న భావం తనలో కనిపించిందని ఏంజెల్ తెలిపారు. 
 
మెక్సికోలోని హై సెక్యూరిటీ జైళ్ల నుంచి రెండు సార్లు తప్పించుకున్ గుజ్‌మెన్ బాత్ రూమ్‌కి దారితీసే సొరంగాన్న అమెరికాలో మాత్రం నిర్మించనివ్వమని ఏంజెల్ నవ్వుతూ చెప్పారు. గత సంవత్సరం జైలుగదిలోని టాయ్ లెట్ నుంచి సొరంగం తవ్వి మరీ తప్పించుకున్న గుజ్ మెన్ మెక్సికో కారాగార వ్యవస్థను నవ్వుల పాలు చేశాడు. చివరికి మాఫియా కింగ్‌ను కలిసే నెపంతో హాలీవుడ్ నటుడు సీన్ పెన్‌ను గుజ్‌మెన్ ఉన్న చోటుకు పంపించిన అమెరికా ఫెడరల్ ఏజెంట్లు మెక్సికో లోని లోస్ మోచిస్ నగరంలోని చిన్న హోటల్‌లో వలవేసి పట్టుకున్నారు. 
 
గుజ్‌మెన్‌ను అమెరికాకు తరలించాలంటే అతడికి భవిష్యత్తులో మరణశిక్ష విధించరాదని మక్సికో ప్రభుత్వం కోరడంతో అమెరికాలో అతడికి యావజ్జీవ శిక్షమాత్రమే పడే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగానే అమెరికా ప్రభుత్వం గత సంవత్సరం గుజ్‌మెన్‌పై ఉన్న హత్యారోపణలను తొలగించింది.
 
తన ప్రత్యర్థులను తుదముట్టించిన తర్వాత వారి రక్తాన్ని పారించడానికి ఇంట్లోనే రక్తకాలువను విడిగా తవ్వించి రాక్షసానందం పొందిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియా కింగ్ గుజ్‌మెన్ రక్త చరిత్ర అలా ముగిసింది.
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments