Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐన్‌స్టీన్ జాకెట్ వేలం.. రూ.98 లక్షలకు అమ్ముడుపోయింది!

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రవేత్త అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన గురించి అంతగా తెలియని మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఆయన యుద్ధాన్ని, జాతి వివక్షతను, తీవ్రంగా వ్యతిరేకించారు.

Webdunia
సోమవారం, 18 జులై 2016 (08:38 IST)
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రవేత్త అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన గురించి అంతగా తెలియని మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఆయన యుద్ధాన్ని, జాతి వివక్షతను, తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రముఖ పాత్రను సైతం పోషించారు. మేథస్సులో ఐన్‌స్టీన్‌ను మించిన మేథావి ఈ భూ ప్రపంచంలోనే లేరు. గణిత, భౌతిక శాస్త్రాలకు సంబంధించి ఎన్నో కొత్త సిద్ధాంతాలను సృష్టించి చరిత్ర సృష్టించారు. 
 
అలాంటి నోబెల్‌ గ్రహీత, భౌతిక శాస్త్రవేత ఐన్‌స్టీన్ 1930లో ధరించిన జాకెట్‌‌ వేలాన్ని లండన్‌లో నిర్వహించారు. ఈ జాకె‌ట్‌ని ప్రముఖ దుస్తుల సంస్థ లెవిస్‌ రూ.98 లక్షలకు పైగా పెట్టి తన వశం చేసుకుంది. అంత పెట్టి సొంతం చేసుకున్నారంటే ఆ జాకెట్ కున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. 1930ల్లో ఐన్‌స్టీన్ ఎక్కువగా ఈ కోటునే ధరించేవారట. 
 
అప్పట్లో ఐన్‌స్టీన్ దిగిన చాలా ఫోటోల్లో చాలా వరకు ఈ జాకెట్‌తోనే ఉన్నాయి. ఈ జాకెట్‌కి ఒక చరిత్రే ఉంది. అదేంటంటే..''హిట్లర్‌ పరిపాలన నుంచి విముక్తుడిగా కావాలని ఐన్‌స్టీన్‌ జర్మనీ నుంచి అమెరికాకు వెళ్లిన తర్వాత ఐన్‌స్టీన్‌ ఈ జాకెట్‌ను కొనుగోలు చేశారట''. అమెరికాతోపాటు వివిధ దేశాల్లో వేదికలపై ప్రసంగాలను ఇచ్చేటప్పుడు ఇదే జాకెట్‌తోనే ఇచ్చేవారట. అదండీ సంగతి.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments